Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీకి 125 సీట్లా…? రాయపాటి జోస్యం నిజమైయ్యేనా …??

టీడీపీకి 125 సీట్లా…? రాయపాటి జోస్యం నిజమైయ్యేనా …??
-ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీకి 125 సీట్లు అంటున్న రాయ‌పాటి
-గుంటూరు ఉమ్మ‌డి జిల్లా నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ
-వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌న్న మాజీ ఎంపీ రాయ‌పాటి
-టీడీపీ పొత్తుల‌పై చంద్ర‌బాబుదే నిర్ణ‌య‌మ‌ని వ్యాఖ్య‌
-ఎన్నికల్లో త‌న పోటీపై చంద్ర‌బాబే నిర్ణ‌యం తీసుకుంటార‌ని వెల్ల‌డి

నిజంగా ఇది నిజమా ? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 125 సీట్లు వస్తాయంటూ టీడీపీ నేత మాజీఎంపీ రాయపాటి సాంబశివరావు జ్యోష్యం చెప్పారు .ఏపీలో రాజకీయాలు ఎన్నికలు ఇప్ప్పట్లో లేనప్పటికీ హీటెక్కాయి.ఎవరికీ వారి అధికారం మాదే అనే ధీమాతో ఉన్నారు . అమరావతి రాజధాని వివాదం ,వైసీపీకి నష్టం తెస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి పడకేసింది ,పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అందువల్ల ఏపీ ప్రజలు జగన్ పాలనపట్ల అసంతృప్తిగా ఉన్నారని అందువల్ల జగన్ ఓటమి ఖాయమని బల్లగుద్ది మరి చెబుతున్నారు .వైసీపీకి ప్రత్యాన్మాయంగా అన్ని పార్టీలను ఏకం చేయాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలించాలి లేవు .బీజేపీ తో ఆయన పొత్తు కొనసాగుతుందా లేక ఎన్నికల నాటికీ టీడీపీతో కలిసి నడుస్తారా ? అనే చర్చకూడ ఉంది. అందువల్ల ఎన్నికలకు ఇంకా యాడాదిన్నర సమయం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే మాటకు తావు లేదు ..పైగా జగన్ భవిషత్ ఉన్న కుర్రవాడు అనే అభిప్రాయం బలంగా ప్రజల్లో ఉంది . దానికి తోడి ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా అందుతున్నాయి. పరిపాలనలో మార్పులు తిరుకోని వచ్చారు . అందువల్ల జగన్ ను ఓడించడం సాధ్యమేనా అనే చర్చకూడ జరుగుతుంది.మరి రాయపాటి అందుకే ఇప్పటికిప్పుడు అని చెప్పి ఉంటారనే అభిప్రాయాలూ ఉన్నాయి…

2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే 125కు పైగా స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తుల విష‌యంలో అంతిమ నిర్ణ‌యం చంద్ర‌బాబుదేన‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు.

గుంటూరు ఉమ్మ‌డి జిల్లా టీడీపీ నేత‌ల‌తో శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఉమ్మ‌డి జిల్లా యూనిట్‌గా నేత‌లంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన రాయ‌పాటి.. మీడియాతో మాట్టాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై తాను ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు. అంతేకాకుండా ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాలో, వ‌ద్దో చంద్ర‌బాబే నిర్ణ‌యిస్తార‌ని కూడా ఆయ‌న తెలిపారు.

Related posts

ప్రజాసమస్యలే మా ఎజెండా …అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కమ్యూనిస్టుల లక్ష్యం …కూనంనేని

Drukpadam

ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి!

Drukpadam

మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్!

Drukpadam

Leave a Comment