Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి!
-కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ‌గోపాల్ రెడ్డి
-మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న వైనం
-ఉప ఎన్నిక‌ల‌పైనే అమిత్ షాతో చ‌ర్చ‌లు

అందరిచూపు మునుగోడు వైపు ఉన్న నేపథ్యం …రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఎప్పడు ఎన్నిక జరుగుతుందా ?అని ఎదురు చూస్తున్న వేళ బీజేపీ లో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీచేయనున్న సందర్భంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది …తెలంగాణ రాజకీయాలను మునుగోడు ఎన్నిక తేల్చనున్నాడని భావిస్తున్న సమయంలో అన్ని పార్టీలకు ఈఎన్నిక కీలకంగా మారింది.నెలరోజుల క్రితం నుంచే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి.నియోజకవర్గంలో రోజు విందులు ,వినోదాలతో ప్రజలు జల్సా చేసుకుంటున్న వేళ , పోటీలో ఉన్న అభ్యర్హులకు చమురు వదులుతోంది. దీంతో తొందరగా ఎన్నిక జరగాలని కోరుకుంటున్నారు .అందువల్ల కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసి మునుగోడు లో గెలుపు అవకాశాలను గురించి వివరించినట్లు సమాచారం…

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాజ‌గోపాల్ రెడ్డి… ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే ఆయ‌న అమిత్ షా స‌మ‌క్షంలోనే బీజేపీలో చేరిపోయారు.

కోమ‌టిరెడ్డి రాజీనామాతో త్వ‌ర‌లోనే మునుగోడుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా రాజ‌గోపాల్ రెడ్డే బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అమిత్ షాతో భేటీ అయిన రాజ‌గోపాల్ రెడ్డి… మునుగోడు ఉప ఎన్నిక‌ల‌పైనే కేంద్ర మంత్రితో చ‌ర్చించారు. మునుగోడులో బీజేపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌తో పాటుగా ఇత‌ర పార్టీల ఎన్నిక‌ల వ్యూహాల‌పైనా ఆయ‌న అమిత్ షాతో చ‌ర్చించారు.

Related posts

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం: విజయసాయిరెడ్డి….

Drukpadam

వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

Drukpadam

ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్ర‌జ‌లు సాధించిన విజయం: ఈట‌ల రాజేంద‌ర్

Drukpadam

Leave a Comment