ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వర్ణమయం… గోడలనిండా కరెన్సీ కట్టలే!
- పెనుగొండ ఆలయానికి 135 ఏళ్ల చరిత్ర
- కొలువైన వాసవి కన్యకాపరమేశ్వరి
- నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయానికి 135 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ ప్రాచీన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇది ఆలయం వెలుపలి సంగతి మాత్రమే.
గర్భగుడిలోకి వెళ్లి చూస్తే మతిపోతుంది. అమ్మవారి విగ్రహం బంగారంతో ధగధగ మెరిసిపోతూ దర్శనమిస్తుంది. అంతేకాదు, గర్భగుడి గోడల నిండా కరెన్సీ కట్టలే కనిపిస్తాయి. ఈ విధమైన అలంకరణకు రూ.8 కోట్లు వినియోగించారు.
ఆలయ కమిటీ దీనిపై స్పందిస్తూ, అమ్మవారి అలంకరణ కోసం ఈ డబ్బు, నగలు భక్తులే స్వచ్ఛందంగా ఇచ్చారని, నవరాత్రులు పూర్తయ్యాక ఎవరి డబ్బు, నగలు వారికి ఇచ్చేస్తామని వెల్లడించింది.