Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చిలకలూరిపేటలో కలకలం రేపుతున్న చిన్నారి కిడ్నాప్!

చిలకలూరిపేటలో కలకలం రేపుతున్న చిన్నారి కిడ్నాప్!

  • ఎనిమిదేళ్ల రాజీవ్ సాయిని కిడ్నాప్ చేసిన దుండగులు
  • చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్న రాజీవ్ తండ్రి
  • దసరా పండుగ కోసం చిలకలూరిపేటకు వచ్చిన కుటుంబం

దసరాపండగ కోసం చెన్నై లో ఉంటున్న ఒక కుటుంబం చిలకలూరిపేట వచ్చింది. ఈసందర్భంగా స్థానిక దేవాలయంలో తల్లుదండ్రులు పూజలు చేయించుకుంటుండగా 8 సంవత్సరాల రాజీవ్ సాయి అనే తమ కుమారుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నప్ చేశారు .పిల్లవాడికోసం దేవాలయం చుట్టుపక్కల గాలించిన కుటుంబసభ్యులకు ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .దీంతో రంగంలోకి దిగినపోలీసులు పిల్లవాడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు..

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి (8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో… బాలుడుని దుండగులు కిడ్నాప్ చేశారు.

రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కిడ్నాప్ కు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Related posts

బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడి అరెస్టు.. !

Ram Narayana

మున్నేరులో గల్లంతైన ఐదుగురు చిన్నారులూ మృతి.. ఏటూరులో విషాదం!

Drukpadam

అమెరికాలో దారుణం.. షికాగోలో ఏడుగురిని కాల్చిచంపి పరారైన దుండగుడు

Ram Narayana

Leave a Comment