దటీస్ కేసీఆర్ దేశమంతా ఇదే ఫార్ములా …అభ్యర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు!
-మునుగోడు అభ్యర్థికి బీఫామ్‌తో పాటు రూ.40 లక్షల చెక్కును అందించిన కేసీఆర్
-మునుగోడు ఉప బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల
-ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ప్రభాకర్ రెడ్డి
-ఎన్నికల ఖర్చుల కోసమంటూ ప్రభాకర్ రెడ్డికి రూ.40 లక్షల చెక్కును ఇచ్చిన కేసీఆర్
కేసీఆర్ స్టయిలే వేరు …ఆయన వేది చేసిన సంచలనమే …ఉద్యమాల ద్వారా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న కేసీఆర్ ఇప్పుడు జాతీయరాజకీయాలపై కన్నేశారు . అందులో భాగంగానే ఆయన జాతీయపార్టీని ప్రకటించారు. ఇదే సందర్భంగా వచ్చిన మునుగుడు ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు . ప్రకటించడమే కాదు బీఫామ్ అందించి ప్రచార ఖర్చులకోసం 40 లక్షల రూపాయల చెక్కును పార్టీ ఫండ్ నుంచి అందజేశారు. అందువల్ల దటీస్ కేసీఆర్ అంటున్నారు టీఆర్ యస్ కార్యకర్తలు . దేశమంతా తాను పోటీచేసే నియోజకవర్గాల అభ్యర్థులకు నిధులు అందజేశారని అభిప్రాయాలు ఉన్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్ నుంచి డబుల్ బొనాంజా అందింది. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌కు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి… సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవసరమైన బీఫామ్‌ను ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ అందజేశారు.
అనంతరం ఉప ఎన్నికల్లో ఖర్చుల కోసమంటూ ప్రభాకర్ రెడ్డికి రూ.40 లక్షల చెక్కును కేసీఆర్ అందించారు. పార్టీ నిధి నుంచే ఈ మొత్తాన్ని ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ అందించినట్లు టీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశమివ్వడంతో పాటుగా ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షలను ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు.