Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో హీట్ పెంచుతున్న రాజధాని వ్యవహారం ఎత్తులు పై ఎత్తులు…

ఏపీలో హీట్ పెంచుతున్న రాజధాని వ్యవహారం ఎత్తులు పై ఎత్తులు…
ఇప్పటికే రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ
రాజీనామా ఆమోదం పొందితే టీచర్ పోస్టులో చేరిపోతానని వెల్లడి
విశాఖ రాజధానికి మద్దతుగా కరణం ధర్మశ్రీ రాజీనామా!
-1998 డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు టీచర్ పోస్టులు
-పరిశీలన కోసం ధ్రువపత్రాలు పంపానన్న వైసీపీ నేత
-రాజీనామాకు అవంతి శ్రీనివాస్ సైతం సై
-రాజధాని రైతుల యాత్రపై భగ్గుమంటున్న ఉత్తరాంధ్ర జె ఏ సి
-రైతుల యాత్రకు పెరుగుతున్న నిరసన …ఇప్పటికే పోస్టర్ల కలకలం

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఏపీలో రాజధాని రాజకీయాలు హీటెక్కుతున్నాయి .ఒకపక్క టీడీపీ …మరోపక్క వైసీపీ లు సవాళ్లు ,ప్రతి సవాళ్లతో రాష్ట్రం అట్టుడికి పోతుంది. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ రాజధానికోసం భూములిచ్చామని చెబుతూ రైతులు గతంలో తిరుమలకు పాదయాత్ర నిర్వహించగా ,ప్రస్తుతం అరసవెల్లికి పాదయాత్ర చేపట్టారు .ఈ రెండు సందర్భాలలో పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పాదయాత్రకు అనుమతి నిరాకరించాయి. అయితే హైకోర్టు జోక్యం తో పాదయాత్ర మొదటిసారి పూర్తీ చేసుకోగా రెండవసారి అరసవల్లికి కొనసాగుతుంది. ఇప్పుడు ఇది రాజకీయయాత్రగా మారింది.రాజధాని విషయంలో రెండు పార్టీలు తగ్గేదే లే అంటూ బీష్మించుకోవడం తో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది . ఇటు 29 గ్రామాల రైతులు ,అటు ప్రభుత్వం రాజధాని విషయంలో పట్టుదలతో ఉన్నాయి. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలో అమరావతి కూడా ఉన్న మొత్తం ఒకేచోట ఉండాలని అదికూడా అమరావతిలోనే ఉండాలని రైతులపేరుతో టీడీపీ మరికొన్ని రాజకీయపార్టీల మద్దతుతు యాత్రలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖ రాజధానికి అనుకూలంగా ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది.

1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్‌పై నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇలా ఎంపికైన వారిలో ధర్మశ్రీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్హత పత్రాలను సమర్పించారా? అన్న విలేకరుల ప్రశ్నకు ధర్మశ్రీ స్పందిస్తూ.. విద్యార్హతకు సంబంధించి ధ్రువపత్రాలను పంపాలని కోరడంతో తాను పంపానని, తన రాజీనామా ఆమోదం పొందితే కనుక చోడవరం, దాని సమీపంలోని పీఎస్‌పేటలో ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతానని నవ్వుతూ చెప్పారు.

Related posts

ఘర్షణలకు శాశ్వత ముగింపు కావాలంటే.. తొలుత అమిత్ షా ఇల్లు కూల్చాలి: ఆప్

Drukpadam

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్….

Drukpadam

తాటికొండ రాజయ్య  వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ లో వాస్తవమెంత ?

Drukpadam

Leave a Comment