సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం.. కరోనాతో ఆయన కుమారుడు మృతి
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తన కుమారుడి మృతి గురించి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.