Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మతిమరుపా …? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే …!

మతిమరుపా …? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే …!
-ప్రతిదీ మర్చిపోతున్నారా..? అయితే ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
-చాలా మంది నుంచి వినిపించే మాట మర్చిపోయామనే
-మెదడును చురుగ్గా ఉంచే పనులు చేయాలి
-అవసరమైన పోషకాలు అందేలా చూడడమే పరిష్కారం

జ్ఞాపక శక్తి గొప్ప వరం. కానీ, మర్చిపోవడం నేడు ఎక్కువ మందికి సాధారణమైపోయింది. దీనికి కారణాలు బోలెడు. ఏకాగ్రత లేమి, పోషకాల్లేమి మతిమరుపునకు కారణాలు. జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోని వారికి వీటిని తప్పకుండా ఇవ్వాలి.

వయసుతో పాటు మెదడు కూడా తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. 40 ఏళ్లు దాటిన వారికి ఏటా 5 శాతం మేర మెదడు బరువు, పరిమాణం తగ్గుతుందట. కనుక పోషకాహారం ఎంతో కీలకం అవుతుంది. మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచే చర్యలు కూడా అవసరమే. గేమ్స్, పజిల్స్ తో మెదడును చురుగ్గా చేసుకోవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయలేకపోతే అది మెదడు సామర్థ్యం తగ్గిందనడానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.

చేపలు
చేపలు చేసే మేలు చాలానే ఉంది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. ప్రొటీన్ కూడా లభిస్తుంది. ట్రౌట్, సార్డిన్స్, మాకెరెల్, హెర్రింగ్, ట్యూనా, సాల్మన్ రకం చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

గింజలు
గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుమ్మడి గింజలతో యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడుకు రక్షణ కల్పిస్తాయి. జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వీటిల్లో ఎక్కువ. వీటిని తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

గుడ్లు
కోడి గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 13 రకాల విటమిన్లు లభిస్తాయి. ఎంతో ముఖ్యమైన విటమిన్ డీ సైతం గుడ్డు నుంచి అందుతుంది. కాలేయం పనిచేయడానికి, సాధారణ మెదడు పనితీరుకు, గుండె స్పందనలకు, కండరాల కదలికలకు, ఆరోగ్యకరమైన జీవక్రియలకు అవసరమైన కొలైన్ సైతం గుడ్డు నుంచి అందుతుంది.

ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, బ్రొక్కోలీ చాలా మంచివి. వీటిల్లో ఫొలేట్, విటమిన్ బీ9 అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కాగ్నిటివ్ పనితీరును పెంచుతాయి. ఇందుకు అవసరమైన విటమిన్ కే వీటి రూపంలో అందుతుంది.

యుగర్ట్
యుగర్ట్ ను (పెరుగు) తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. యుగర్ట్ తో జింక్, విటమిన్ బీ, ప్రొబయాటిక్, డీ విటమిన్ లభిస్తాయి. మెదడు ఆరోగ్యానికి, కాలేయం, గుండె పనితీరుకు ఇవి అవసరం.

Related posts

ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ కు బదిలీ – కొత్త కలెక్టర్ గా విపి గౌతమ్…

Drukpadam

దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి…బీఆర్ యస్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్…

Drukpadam

అన్న కొడుకు పెళ్ళిలో అంతా తానై వ్యవహరించిన మంత్రి పువ్వాడ అజయ్ …

Drukpadam

Leave a Comment