Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మార్కెట్ కూల్చివేతకు మంత్రి పువ్వాడకు సంబందం ఏమిటి :మైనార్టీ సెల్

మార్కెట్ కూల్చివేతకు మంత్రి పువ్వాడకు సంబందం ఏమిటి :మైనార్టీ సెల్
-మంత్రిపై బురదజల్లే ఆరోపణలు తగదు
-ఖమ్మం వైరారోడ్ చేపల మార్కెట్ ను చట్ట ప్రకారం ఖాళీ
-అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చిన కూడా మంత్రిపై రాద్దాంతం
-విలేకరుల సమావేశంలో బారాసా మైనార్టీ సెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్..

ఖమ్మం నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రు పువ్వాడ అజయ్ పై అసత్య ఆరోపణలతో బురదజల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని మైనార్టీ సెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షలు తాజుద్దీన్ అన్నారు . నిరంతరం ప్రజలకోసం పనిచేస్తూ , తనమార్క్ పరిపాలన అందిస్తున్న అజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు .చేపల మార్కెట్ కూల్చివేతకు మంత్రి అజయ్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కోర్ట్ తీర్పును అధికారులు అమలు జరిపితే మంత్రిని నిందించడం తగదన్నారు .

ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైరా రోడ్డు ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన చేపల మార్కెట్ కాంప్లెక్స్ ను ఖాళీ చేయించే అంశంలో భాగంగా చట్టప్రకారం కిరాయిదారులకు ముందస్తుగా నోటీసులు అందించి ఖాళీ చేయించడం జరిగిందని, ఈ అంశాన్ని కొంతమంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేయడం బాధాకరమని భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..
2016లోనే ప్రభుత్వం తరఫున క్వాలిటీ కంట్రోల్ బోర్డు విభాగ అధికారులు ఈ కాంప్లెక్స్ ను పర్యవేక్షించి ఏదైనా విపత్తులు, భారీవర్షాలు కురిసిన నేపద్యంలో ఈ కాంప్లెక్స్ భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేసిన నేపద్యంలో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పుడు మున్సిపల్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో అందులో వ్యాపారాలు నిర్వహించుకునేవారు తమకు సమయం కావాలని కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.. కాగా వారు అడిగిన గడువు పూర్తయిన తర్వాత మరల ఆరు నెలల గడువుని పొడగించుకోగా ఆగడువులో కూడా వారు కిరాయిలను అనుభవించారాన్నారు.. మొత్తానికి వారు ఇచ్చిన గడువు తీరిపోయుందన్నారు.. మరల మూడవ దశ కూడా వారు ఖాళీ చేయడం కోసం సమయం అడిగిన నేపథ్యంలో కోర్టు వారు మొత్తంగా మూడుసార్లు గడువు ఇచ్చారని గుర్తుచేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా మానవీయకోణంతో మరో 40 రోజులు అనధికారికంగానే గడువు తీసుకున్నారన్నారు..
అయినాకూడా అందులో వ్యాపారాలు చేసుకునే కిరాయిదారులు ఖాళీ చేయకపోవడంతో 2022 అక్టోబర్ మూడో తేదీన మున్సిపల్ శాఖ అధికారులు ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసులను ఇవ్వడం జరిగిందని,అయినా కూడా వారు కోర్టు నోటీసులను, మరియు మున్సిపల్ శాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడంతో మున్సిపల్ శాఖ అధికారులు హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 10 వ తేదీన మున్సిపల్ శాఖ రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో..ఖాళీచేయించడం జరిగిందన్నారు.. మొత్తంగా
ఈ వ్యవహారంలో రవాణా శాఖ మంత్రి పై బురదజల్లే ప్రయత్నం సమంజసంకాదని ఆయన ఆరోపించారు..
కులమతాలకతీతంగా అభివృద్దే ధ్యేయంగా ఖమ్మం నగరాన్ని మెట్రోపాలిటన్ నగరాల సరసన అభివృద్ధిని నిలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆరోపణలు, విమర్శలు చేయడం సరైనది కాదని తాజుద్దీన్ అన్నారు…
ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సిటీ ప్రెసిడెంట్ షoశుద్దిన్, షాదిఖానా డైరెక్టర్ సలీం, బాబి, అన్వర్ , తాజ్, షమి, షాకిర్, ఇజ్హర్, ఫసి తదితరులు పాల్గొన్నారు …

Related posts

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

Drukpadam

ప్రజాసమస్యలే మా ఎజెండా …అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కమ్యూనిస్టుల లక్ష్యం …కూనంనేని

Drukpadam

రాజకీయాల్లోకి ,చట్టసభలకు రావడం జరగదుగాక జరగదు …చిరంజీవి!

Drukpadam

Leave a Comment