Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై స్పందించిన ఈసీ!

గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై స్పందించిన ఈసీ!

  • హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి మాత్రమే షెడ్యూల్ ప్రకటన
  • గుజరాత్ ను విస్మరించడంపై అనుమానాలు
  • నిబంధనల ఉల్లంఘన జరగలేదంటున్న ఎన్నికల ప్రధాన అధికారి

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికలను ప్రస్తావించకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. హిమాచల్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీకి కూడా ఈ రోజే షెడ్యూల్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఒక్క హిమాచల్ ఎన్నికల తేదీలను మాత్రమే ప్రకటించి గుజరాత్ ను విస్మరించడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆరు నెలల వ్యవధిలో ముగిసే రాష్ట్రాల ఎన్నికలను ఒకే షెడ్యూల్ లో నిర్వహిస్తారు. హిమాచల్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం జనవరి 8వ తేదీన ముగుస్తుండగా, గుజరాత్ శాసన సభకు ఫిబ్రవరి 18 వరకు గడువు ఉంది.

రెండింటికీ షెడ్యూల్ ప్రకటించాల్సిన ఈసీ.. కేవలం హిమాచల్ ఎన్నికలకే ప్రకటన చేయడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీనిపై  కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ స్పందించారు. విస్తృత చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాతావరణ మార్పులు, ఇతర కారణాల దృష్ట్యా హిమాచల్ ఎన్నికలను కాస్త ముందుగా ప్రకటించామన్నారు. రెండు రాష్ట్రాల శాసన సభల పదవీకాలం ముగింపునకు మధ్య 40 రోజుల గడువు ఉందన్నారు. ఒక రాష్ట్రం ఫలితం మరో రాష్ట్ర ఎన్నికపై పడకుండా ఉండేందుకు 30 రోజుల విరామం ఉంటే సరిపోతుందని చెప్పారు. అయితే, గుజరాత్ కు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం ఆయన చెప్పలేదు.

ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 

  • ఈ నెల 17న హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్‌
  • న‌వంబ‌ర్ 12న పోలింగ్‌
  • డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు
  • షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

ఉత్త‌రాది రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌నర్ రాజీవ్ కుమార్‌… ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అనూప్ చంద్ర పాండేతో క‌లిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్రకారం ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తి కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండ‌గా… వాటికి న‌వంబ‌ర్ 12న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపును డిసెంబ‌ర్ 8న చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తారు. ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 17న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుండ‌గా…అదే రోజు నుంచి నామినేష‌న్ల దాఖ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఈ నెల 25తో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగియ‌నుండ‌గా… 29 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంది.

Related posts

నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ….

Drukpadam

సముద్రాన్ని తలపిస్తున్న తెలంగాణ …గోదావరి మరోసారి ఉగ్రరూమం ఈ రాత్రికి 64 అడుగులు

Drukpadam

డాక్టర్లపై దాడులకు నిరసనగా 18న దేశవ్యాప్త ఆందోళనకు: ఐఎంఏ…

Drukpadam

Leave a Comment