Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ విశాఖను వీడాలి …ఏపీ పోలీస్ ..

సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలి… పవన్ కు ఏపీ పోలీసుల నోటీసులు..

  • ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన పవన్
  • విశాఖలో పవన్ సహా జనసేన నేతలకు పోలీసుల నోటీసులు
  • నోటీసుల విషయంలో పోలీసులు, జనసేన నేతల మధ్య వాగ్వాదం

విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్ తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Related posts

చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క!

Drukpadam

కన్యాకుమారి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారా…?

Drukpadam

టికెట్ ఇవ్వకుంటే కారు దిగేస్తానన్న మాజీ ఎమ్మెల్యే…తీగల కృష్ణారెడ్డి వార్నింగ్.

Drukpadam

Leave a Comment