Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ యస్ నేతలపై బిగిస్తున్న ఉచ్చు …ఎంపీ నామ ఆస్తుల జప్తు …

టీఆర్ యస్ నేతలపై బిగిస్తున్న ఉచ్చు …ఎంపీ నామ ఆస్తుల జప్తు …
-నామపైచీటింగ్ కేసు … ఈడీ దూకుడు ఒకే సమయంలో మూడు చోట్ల దాడులు
-రాంచి హైవే పేరుతొ 362 కోట్ల అప్పు తీసుకోని పక్కదార్లు పట్టించారని అభియోగం ..
-రుణాల పేరిట మోసానికి పాల్పడ్డారంటూ నామాపై ఈడీ కేసు
-నామ నాగేశ్వరరావు ,సీతయ్య పేర్లతో 6 డొల్ల కంపెనీలు
-గతంలోనే రూ.67 కోట్లను జప్తు చేసిన ఈడీ
-తాజాగా రూ.80.65 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల జప్తు
-జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయాన్నీ జప్తు చేసిన ఈడీ

టీఆర్ యస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం తమ చెప్పుచేతుల్లో లేనివారి వెంటాడి ,వేటాడి వేదిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో టీఆర్ యస్ లోకసభ పక్షనేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కు చెందిన మధు కాన్ గ్రూప్ కంపెనీ లపై ఏకకాలంలో దాడులు చేసింది. హైద్రాబాద్ లోని ప్రధాన కార్యాలయంతోపాటు , ఖమ్మం ,ప్రకాశం జిల్లాల్లోని మధు కాన్ కంపెనీ లపై దాడులు చేసి ఆస్తులను జప్తు చేయడంపై తెలంగాణాలో కలకలం ప్రారంభమైంది. ఒక్క నామ నే కాకుండా మరికొందరిపై కూడా దాడులు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. నామ రాంచి ఎక్స్ ప్రెస్ హైవే పేరుతొ బ్యాంకు లనుంచి 362 కోట్ల రూపాయలు అప్పు తీసుకోని దారి మళ్లించారని, చీటింగ్ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు .గతంలోనే 70 కోట్ల రూపాయలకు ఆస్తులు జప్తు చేయగా , సోమవారం 80 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం . నామ రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్ గా ఉండి మధు కాన్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు . ఆయన రెండవసారి ఖమ్మం నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి లోకసభకు ఎన్నికైయ్యారు . లోకసభలో పార్టీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు .పార్టీ పక్షాన గట్టిగ గళం వినిపిస్తున్నారు . బీజేపీ ఆయనపై వలవేసినట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ ప్రతిపాదనలను తిరస్కరించడంతో దర్యాప్తు సంస్థల ద్వారా వత్తిడి తెస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు

  .

నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకివ్వడంతో గులాభి నేతల్లో గుబులు పుట్టింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది. నామా ఆధ్వర్యంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ రుణాల పేరిట మోసానికి పాల్పడిందంటూ ఇదివరకే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఇదివరకే నామా కంపెనీల్లో సోదాలు చేపట్టిన ఈడీ గతంలోనే రూ.67 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసమంటూ రుణాలు తీసుకున్న మధుకాన్.. ఆ నిధుల్లో రూ.362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. అంతేకాకుండా నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలు 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. ఈ కేసులోనే తాజాగా నామాకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.

Related posts

న్యూ ఇయర్ వేళ తీరని విషాదం.. వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి!

Drukpadam

13 కిలోల బరువు తగ్గిన మస్క్.. సీక్రెట్ ఇదేనంటూ ట్వీట్!

Drukpadam

ఎంపీ పార్థసారథి రెడ్డి ఫౌండేషన్ కు భూ కేటాయింపులను రద్దు చేసిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment