Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో మాతో పని లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

మాతో పని లేదు.. మునుగోడులో కాంగ్రెస్ ను ఆయనే గెలిపిస్తాడు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • మునుగోడు ప్రచారానికి వెళ్లబోనన్న వెంకటరెడ్డి
  • తాను హోంగార్డునని.. ఎస్పీ స్థాయి వ్యక్తులే వెళ్తారని ఎద్దేవా
  • తన గురించి మాట్లాడేంత స్థాయి కడియం శ్రీహరికి లేదని వ్యాఖ్య

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను హోంగార్డునని… ప్రచారానికి ఎస్పీ స్థాయివారే వెళతారని చెప్పారు. 100 కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తామని చెప్పిన నాయకుడే ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపిస్తారని అన్నారు. తమలాంటి వాళ్ల అవసరం లేదని అన్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిపై కూడా ఆయన మండిపడ్డారు. తన గురించి మాట్లాడేంత స్థాయి శ్రీహరికి లేదని అన్నారు. తాను విదేశాలకు ఎప్పుడు వెళ్లాలనే విషయం గురించి మంత్రి కేటీఆర్ ను అడగాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశారనే మీడియా ప్రశ్నకు బదులుగా… ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేశామనేది చెపుతామా? అని ప్రశ్నించారు. అది చెప్పడం చాలా పెద్ద తప్పు అని అన్నారు.

Related posts

మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్!

Drukpadam

ఆశల పల్లకిలో ఊరేగిన తిప్పేస్వామి …మంత్రిపదవి వచ్చినట్లే వచ్చి పోయింది

Drukpadam

వైసిపిని తిట్టి పవన్ పై అభిమానం చాటుకున్న హైపర్ అది …!

Drukpadam

Leave a Comment