Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

  • ఐదేళ్ల క్రితమే వివాహం
  • ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు వెళ్లిన దంపతులు
  • 200 అడుగుల ఎత్తు నుంచి పడి శ్రీనాథ్ మృతి

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. సాయిచరణి, శ్రీనాథ్ ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌కు వెళ్లారు. అక్కడ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు .. అప్రమత్తమైన పోలీసులు!

Ram Narayana

విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్ కు వినితి పత్రం…

Drukpadam

ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు!

Drukpadam

Leave a Comment