Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీలకు మునుగోడు ఫీవర్ …

పార్టీలకు మునుగోడు ఫీవర్ …
ఎన్నికల నిబంధనలు బేఖాతర్!
చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం
మద్యం ,మాంసం ,డబ్బులు విచ్చలవిడిగా పంపిణి
అన్ని పార్టీలది అదేదారి

మునుగోడు …మునుగోడు …ఎక్కడ చుసిన ఇదే చర్చ … మునుగోడు ఉపఎన్నిక ఫీవర్ పెరిగింది. ఎన్నికల నియమనిబంధలను అన్ని పార్టీలు బేఖాతర్ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తున్నదని విమర్శలు ఉన్నాయి నియోజకవర్గంలో మద్యం , మాంసం , డబ్బులు విచ్చలవిడిగా పంపిణి జరుగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ,దేశవ్యాప్తితంగా ఇక్కడ అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక వైపు చూస్తున్నారు . మూడు పార్టీల్లో ఎవరు గెలుస్తారు . టీఆర్ యస్సా…బీజేపీనా ?? కాంగ్రెస్ గెలుస్తుందా ??? అనేది ఆసక్తిగా మారింది. ఈ ఎన్నిక అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలిచే అవకాశం ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది . గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. …అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరి కాషాయం కండువా కప్పుకొని కమలం గుర్తు పై తిరిగి పోటీ చేస్తున్నారు . అసలు ఆయనకు కాంగ్రెస్ తో వచ్చిన ఇబ్బంది ఏమిటనేది ప్రజల మనస్సులో ఉన్న ప్రశ్న ? నియోజకవర్గంలో చాల గ్రామాల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయడంపై ప్రజలు నిలదీశారు . ,మీది తప్పుడు నిర్ణయమని మొఖం మీదనే చెప్పేశారు . మరికొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేయడం పై విమర్శలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఎత్తులు వేస్తున్న బీజేపీ ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అందులో భాగంగానే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బుట్టలో వేసుకున్న బీజేపీ టీఆర్ యస్ పై కయ్యానికి కాలుదువ్వుతోంది. టీఆర్ యస్ కూడా బీజేపీ,కాంగ్రెస్ లకు తామే ప్రత్యాన్మాయమని అసలు కాంగ్రెస్ చచ్చిపోయిందని ,దాని అడ్రెస్స్ లేదని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని అందిపుచ్చుకుంటుంది. బీజేపీ, టీఆర్ యస్ లు కావాలనే కాంగ్రెస్ ను లేకుండా చెయ్యాలని చూస్తున్నాయని ,కేసీఆర్ బీజేపీ వ్యతిరేక ప్రచారం వట్టి బూటకమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు .అందుకు గతంలో బీజేపీ తో టీఆర్ యస్ అంటగట్టిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు.

మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్నాయి .ప్రధానంగా టీఆర్ యస్ ,బీజేపీ పార్టీలకు ఈ ఎన్నిక ప్రాణ సంకటంగా మారింది . రాజగోపాల్ రెడ్డి అహంకారానికి ,మునుగోడు ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరులా ఈ ఎన్నికను టీఆర్ యస్ అభివర్ణిస్తుండగా , మునుగోడు ఎన్నికల ద్వారానే అవినీతి కేసీఆర్ అంతం సాధ్యమని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడులో తాను గెలవగానే తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ కుప్ప కూలడం ఖాయమని ఆయన ఢంకా భజాయిస్తున్నారు.

ఈ రెండు పార్టీల విమర్శలు ఎలా ఉన్న మూడవ అభ్యర్థి కూడా రంగంలో మంచి పోటీ ఇస్తున్నారనే ప్రచారం లేకపోలేదు . కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సైతం ప్రచారంలో తనదైన శైలిలో ఓట్లర్లను ఆకట్టు కుంటున్నారు . ఇంటింటా ప్రచారం చేయడంలో కాంగ్రెస్ ముందుండగా , ప్రలోభాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని మిగతా ప్రధాన పార్టీలు చూస్తున్నాయని విమర్శలు లేకపోలేదు . పార్టీల ప్రచారానికి ప్రజలకు కూలి ఇచ్చి మరి తీసుకుపోతున్నారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారి వెంట ప్రచారానికి వెళ్లాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు .పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో హీటెక్కుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండనే అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు .

Related posts

సోనియా కరోనా వ్యాక్సిన్ రహస్యంగా ఎందుకు వేయించుకున్నారు :బీజేపీ…

Drukpadam

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్!

Drukpadam

గుంటూరు జిల్లా టీడీపీ నేత చంద్ర‌య్య దారుణ హ‌త్య‌…

Drukpadam

Leave a Comment