Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంట పొలాల్లో కాలవ గట్లను దూకుతూ సాగిన చంద్రబాబు… 

పంట పొలాల్లో కాలవ గట్లను దూకుతూ సాగిన చంద్రబాబు… 

  • పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
  • రైతుల సమస్యలపై ఆరా కోసం పొలాల్లోకి దిగిన టీడీపీ అధినేత
  • ఏ ఒక్కరి సాయం లేకుండానే కాలవ గట్లను దూకిన వైనం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వయస్సు 72 ఏళ్లు. అయినా కూడా యువకులకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. తాజాగా బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు.

ఈ సందర్భంగా పంట పొలాల్లో చంద్రబాబు చేసిన పీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పొలం గట్లపై బ్యాలెన్స్ ఎంతమాత్రం కోల్పోకుండా సాగిన చంద్రబాబు… కాలవ గట్లపై నుంచి దూకుతూ సాగారు. కాలవ గట్లపై చంద్రబాబు దూకుతూ ఉంటే…ఆయన వెంట సాగిన టీడీపీ నేతలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే అలర్ట్ అయిపోయారు. చంద్రబాబుకు ముందు కొందరు, ఆయన వెనుకాల కొందరు నిలబడి.. చంద్రబాబుకు సాయం అందించే యత్నం చేశారు. అయితే ఏ ఒక్కరి సాయం లేకుండా చంద్రబాబు కాలవ గట్లను దాటుతూ సాగిపోయారు.

Related posts

అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన!

Drukpadam

కేసీఆర్ అనే రావణాసురుడిని నుంచి విముక్తి లభించింది … తన సస్పెండ్ పై తీవ్రంగా స్పందినచిన పొంగులేటి…

Drukpadam

చీమలపాడు ఘటన రాజకీయపార్టీలకు గుణపాఠం కావాలి …!

Drukpadam

Leave a Comment