Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మనది త్యాగాల గుణం పోరాటాల వారసత్వం ఉన్న సంఘం…విరాహతలి

ఇండ్ల స్థలాల కోసం పోరాడుదాం..
-మనది త్యాగాల గుణం పోరాటాల వారసత్వం ఉన్న సంఘం.
-టి యు డబ్ల్యు జే ఐ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహతలి..

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం పోరాడుదాం అని టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహతలి పిలుపునిచ్చారు.
బుధవారం ఆ సంఘం ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పాటు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చినందున అందరికీ ఇండ్ల స్థలాలు వచ్చి తీరుతాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రిడిటేషన్ ఇచ్చే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం టి యు డబ్ల్యు జే ఐ జే యు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని ఇంకెక్కడైనా కార్డుల జారీలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయి సమావేశం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావడంతో పాటు వేరే సంఘాన్ని సంఘంలో ఉన్న దాదాపు 100 మందికి పైగా టి యు డబ్ల్యూ జే ఐజేయులో చేరుతున్నందుకు ఆయన ఖమ్మం జిల్లా నాయకులను అభినందించారు. సంఘంలో చేరిన అందరి ,విరాహతల్లి స్వాగతం పలికారు ప్రధాన డిమాండ్లుగా ఇండ్ల స్థలాలతో పాటు ఆరోగ్య భద్రత జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీపై విద్యను అందించడం ప్రమాద ప్రమాద బీమా కల్పించడం వంటివి ఉన్నాయన్నారు. వీటి సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు రైల్వే పాసులు ఇప్పించే విషయంలో కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో సంఘం నాయకులు కృషి చేశారని దానికి సంబంధించి జీవో విడుదలైనప్పటికీ ఇంకా రైల్వే పాసులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని దీనిపై మళ్లీ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులను సాధించుకున్న ఘనత టియుడబ్ల్యూజే ఐజేయుదేనని అన్నారు 1966 లో పోరాటాల ద్వారా మండల జర్నలిస్టులకు ఒక గుర్తింపుని ఈ సంఘం తెచ్చిందని ఆయన పేర్కొన్నారు 60 ఏళ్లుగా ఒక నిర్మాణాత్మకమైన పోరాటాలు చేస్తూ చరిత్ర కలిగిన సంఘం ఐజ యు మాత్రమే అన్నారు. పాలకులకు పాలాభిషేకం చేయడం కాకుండా ప్రశ్నించడం నేర్పింది ఈ సంఘం అని ఆయన అన్నారు సంఖ్యా బలం పెంచుకోవడం కాకుండా కలంపట్టి రాసే వాళ్ళు సభ్యులుగా కలిగి ఉన్న బలమైన సంఘం టి యు డబ్ల్యూ ఆయన అన్నారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో బలమైన సంఘంగా ఉందని గల్లీలో జర్నలిస్టుపై దాడి జరిగితే ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసే సత్తా ఉన్న సంఘం తమదని ఆయన పేర్కొన్నారు. కోవిటి సమయంలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర ప్రమాదాల్లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ఇప్పించగలిగిన సంఘం తమదేనని విరాహతలి పేర్కొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు రాయితీపై విద్యను అందించేందుకు కొన్ని జిల్లాల్లో డీఈవో స్థాయిలో సర్కులర్ ఇస్తున్నారని అది జీవో కాదన్నారు జీవో కోసం తమ సంఘం ఆధ్వర్యంలో ఇదివరకే విద్యాశాఖ మంత్రిని కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక గ్రూపు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరగాలని ఆయన సూచించారు అదేవిధంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని మెఫీ ద్వారా ఈ తరగతుల నిర్వహణ జరగాలని ఆయన సూచించారు ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులు రాజకీయ సభల మాదిరిగా ఉంటున్నాయని ఆయన విమర్శించారు. దళిత బంధు విషయంలో దళిత జర్నలిస్టులకు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలని తమ సంఘం కోరగా ముఖ్యమంత్రి స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నిచోట్ల దళిత జర్నలిస్టులు ఈ విషయం అధికారులకు చెప్పి సౌకర్యాన్ని పొందాలని ఆయన సూచించారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు విషయంలోనూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో జర్నలిస్టులను చేర్చిన విషయాన్ని ఉన్నతాధికారులు తమ సంఘం దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. స్టూడియో ఎన్ ఛానల్ లో పనిచేసే ఉద్యోగులకు జీతాల చెల్లింపు విషయంలో తలెత్తిన సంక్షోభాన్ని చిత్తశుద్ధితో టియుడబ్ల్యూజేఐజేయు పరిష్కారం చేసిందని జర్నలిస్టులకు జీతాలు అందే వరకు పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా మోజో టీవీ లో పనిచేసే జర్నలిస్టులకు కూడా జీతాలు ఇచ్చేవరకు పోరాటం చేశామని ఆయన అన్నారు సీనియర్ జర్నలిస్టు విజయ్ సాధు మాట్లాడుతూ టి యు డబ్ల్యూ జె ఐజేయు నాయకులు విరాహతలి నిజాయితీ కలిగిన నాయకులని ఆయన పట్టుదల వల్లే స్టూడెంట్ ఛానల్లో తాను పనిచేస్తున్న సందర్భంలో జర్నలిస్టులందరికీ జీతాలు వచ్చాయని తెలిపారు ఇటువంటి సంఘ
ంలో సభ్యుడుగా ఉండటం గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ మాట్లాడుతూ విలువలు కలిగిన పోరాట పటిమగలిగిన సంఘంలో సభ్యులుగా ఉన్న మనమందరం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు విలువలను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు . కొంతమంది జర్నలిజం వృత్తిలోకి వచ్చి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారికి ఈ సంఘంలో గానీ వృత్తిలో గానీ కొనసాగే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో పోరాడే సంఘంగా గుర్తించి ఇతర సంఘంలో ఉన్నటువంటి 100కు పైగా సభ్యులు టి యు డబ్ల్యూ చేరడం పట్ల ఆయన కమిటీ నాయకులను కొత్తగా చేరిన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు సంతాప తీర్మానం తో పాటు సంఘ కార్యకలాపాలపై ప్రసంగించగా నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర శేషు అక్రిడేషన్
కమిటీ సభ్యులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఎలక్ట్రానిక్ మీడియారాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి కనకం సైదులు పట్టణ అధ్యక్షులు మైస పాపారావు ప్రధాన కార్యదర్శి ఉషోదయం శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్ జిల్లా కోశాధికారి శివానంద నగర కోశాధికారి బసవేశ్వర రావు జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ ఖాదర్ బాబా నాయకులు మురారి నలజాల వెంకటరావు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

Related posts

కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా…మే 10 ఎన్నికలు 13 ఓట్ల లెక్కింపు ..!

Drukpadam

వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తాం: ఏపీ పోలీస్ హెచ్చరిక

Ram Narayana

శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి విదేశీ బంగారు వర్ణ రథాన్ని తీసుకొచ్చిన తుపాను!

Drukpadam

Leave a Comment