Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా?: సీఎం జగన్

ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా?: సీఎం జగన్

  • పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్  కౌంటర్
  • మూడు రాజధానులతో అభివృద్ధి జరగదా..
  • చెప్పులు చూపిస్తూ దారుణంగా తిడుతున్నారన్న జగన్ 
  • ఇలాంటి వాళ్లా మన నాయకులు? అని ఆవేదన

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే, కొంతమంది నేతలు మూడు రాజధానులతో కాదు మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.

ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెబుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్లు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించిన విషయం తెలిసిందే. తనను పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, మీరు కూడా చేసుకోండని పవన్ సూచించారు. మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుని, రెండో పెళ్లి చేసుకొన్నానని అన్నారు. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాను తప్ప కొంతమంది నేతల లాగా ఒక్క పెళ్లి చేసుకుని, ముప్పై మంది స్టెఫినీలతో తిరగలేదని పవన్ మండిపడ్డారు.

Related posts

హుజూరాబాద్​ లో దళితబంధు అమలులకు ఉత్తర్వులు …

Drukpadam

పంజాబ్ రైతులు మోదీపై ఆగ్రహంతో ఉన్నారు… ఎన్నికలతో అది స్పష్టమైంది: శరద్ పవార్

Drukpadam

వేటు వేస్తారా ? రాజీనామా చేస్తారా ? ఎంపీ రఘురామ వ్యవహారం చివర అంకానికి!

Drukpadam

Leave a Comment