Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోమటిరెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆయన వైఖరి బాధిస్తోంది: పాల్వాయి స్రవంతి

  • మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి
  • కోమటిరెడ్డి చేసింది నమ్మక ద్రోహమేనన్న స్రవంతి
  • ప్రచారానికి రాని కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి… భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డిని తాను తన సొంత అన్నగా భావించానని, అయితే ఆయన తనకు నమ్మక ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి రావాలని ఆయనను వేడుకున్నానని కూడా స్రవంతి అన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి వైఖరి తనను తీవ్రంగా బాధిస్తోందని స్రవంతి అన్నారు. సొంత పార్టీ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆమె చెప్పారు. మునుగోడులో ఓ ఆడబిడ్డగా ఒంటరి పోరు సాగిస్తున్నానన్నారు. అయినప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని స్రవంతి ధీమా వ్యక్తం చేశారు.

Related posts

టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది.. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి: వైఎస్ జ‌గ‌న్

Ram Narayana

స్మితా సభర్వాల్ ఇంటికి అర్ధరాత్రి వేళ ఎందుకు వెళ్లాడో చెప్పిన డిప్యూటీ తహసీల్దార్!

Drukpadam

ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ అమలుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

Drukpadam

Leave a Comment