మునుగోడులో గెలుపు టీఆర్ యస్ దే అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!
-చతికిలపడ్డ బిజెపి… అడ్రస్ లేని కాంగ్రెస్
-బీజేపీ ఓటమే తమ పార్టీ లక్ష్యమన్న తమ్మినేని
-బిజెపి ఓటమి పై ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు
-రాజగోపాల్ రెడ్డి చర్యలపై నాయకుల అలక
-పెరుగుతున్న టీఆర్ గ్రాఫ్ …
ముడుగోడు ఉపఎన్నికల వేళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆసక్తికర కామెంట్స్ చేశారు . బీజేపీ చతికలపడగా ,టీఆర్ యస్ గెలుపు ఖాయంగా కనిపిస్తుందని, కాంగ్రెస్ అడ్రెస్స్ లేకుండా పోయిందని అన్నారు .కేవలం రాజగోపాల్ రెడ్డి అహంకారంతోనే ఈ ఎన్నిక జరుగుతుందనే విమర్శలను ఉన్నాయని పేర్కొన్నారు . ఆయన పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పలేక పోతున్నారని పైగా ప్రజలనుంచి వస్తున్నా విమర్శలకు తట్టుకోలేక బీజేపీ అభ్యర్థి తికమక పడుతున్నారని అన్నారు . కాంగ్రెస్ అంతర్గత కలహాలతో పోటీచేసిన స్రవంతి కలత చెందారని అన్నారు . చివరకు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ఎవరు సహకరించడంలేదని కన్నీళ్లు పెట్టుకోవడం ఆపార్టీ బలహీనతకు అద్దం పడుతుందన్నారు .
ఇటీవల చౌటుప్పల్ సిపిఎం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నతమ్మినేని బీజేపీ,పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓటమే ద్యేయంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు . బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని స్ఫష్టం చేశారు. మునుగోడులో బీజేపీని ఎదుర్కొనే శక్తి టీఆర్ యస్ కే ఉందని భావించి వారికీ మద్దతు ఇస్తున్నామని తమ్మినేని తెలిపారు .
బిజెపి ప్రారంభంలో దూకుడుగా వ్యవహరించిందని ,అమిత్ షా ను తీసుకోని వచ్చి హడావుడి చేసిందని ఇప్పుడు ఆపార్టీలోని గెలుపు ఆశలు సన్నగిల్లాయని అన్నారు . మొదట చూపినంత శ్రద్ధ చూపడం లేదని అన్నారు . ఓటర్ల నాడీ అర్థమై ఇక్కడ గెలవడం అసాధ్యమని ఆపార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు . రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పై కొందరు బీజేపీ నేతలు అలక బూనారని పేర్కొన్నారు . కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ఈ ఎన్నికలు వచ్చాయని, 18 వేల కోట్ల కాంట్రాక్టులు పొందారని ప్రజలు చర్చించుకుంటున్నారని ఇదే ఆయనకు పెద్ద మైనస్ గా మారిందని అన్నారు .మరోపక్క కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందని అంతర్గత కలహాలతో సతమతమవుతూ ప్రచారంలో వెనకబడి పోయిందని పేర్కొన్నారు. అందువల్ల టిఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బిజెపి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవ కూడదని అన్నారు .
ఈ ఎన్నికల్లో సిపిఎం ఓటర్లు టిఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయడంతోపాటు వేయించాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో డబ్బు మద్యం విపరీతంగా పంపిణీ చేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు . హైదరాబాద్ నుంచి వాహనాల ద్వారా డబ్బును తరలిస్తూ కోట్ల రూపాయలు కార్లలో దొరికిన విషయాన్ని తమ్మినేని ప్రస్తహించారు . అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తమ్మినేని పిలుపునిచ్చారు.