Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓ హిందువు బ్రిటన్ ప్రధాని అయ్యాడు… మరి భారత్ లో ఓ ముస్లిం ప్రధాని అయ్యేనా?: శశి థరూర్!

ఓ హిందువు బ్రిటన్ ప్రధాని అయ్యాడు… మరి భారత్ లో ఓ ముస్లిం ప్రధాని అయ్యేనా?: శశి థరూర్!

  • బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
  • హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన సునాక్
  • భారత్ కు ఓ పాఠం వంటిదన్న శశి థరూర్

బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. భారత సంతతి హిందువు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం భారత్ కు ఓ పాఠం వంటిదని అభిప్రాయపడ్డారు.

భారత్ లో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా, ఇతరులు ప్రధాని అవగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రోద్బలిత రాజకీయాలు బాగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటిది ఊహించగలమా? అని అన్నారు.

“భారత ఉపఖండంలో జనించిన అన్ని మతాలను హిందుత్వ భావజాలం సమానంగానే చూస్తుంది. కానీ హిందుత్వవాదులే ఇతరులను సమానంగా చూడలేకపోతున్నారు” అని శశి థరూర్ విమర్శించారు.

“గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ “అటవిక ప్రజలు, అటవిక మతం” అని హిందువులు, హిందూ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడా దేశానికి  హిందుత్వవాది రిషి సునాక్ ప్రధాని అయ్యాడు. అదే రీతిలో ఓ క్రైస్తవుడు లేక ఓ ముస్లింను బీజేపీ భారత ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందని మనం ఊహించగలమా?” అని ప్రశ్నించారు.

ఇటలీ దేశస్తురాలిగా, క్రిస్టియన్ గా ముద్రపడిన సోనియా ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుంటానని ఓ ప్రముఖ రాజకీయనేత వ్యాఖ్యానించారంటూ సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను శశి థరూర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Related posts

అయ్యన్న సైకోలాగా మాట్లాడుతున్నాడు : డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు!

Drukpadam

ఆలయ ప్రారంభోత్సవంలో ప్రధాని …మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడేందుకు నో..!

Drukpadam

కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే… ఆ చేయి నరికేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Drukpadam

Leave a Comment