Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

31 న మునుగోడుకు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా …!

31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ… ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరు

  • ఇదివరకే మునుగోడు సభను ప్రకటించిన బీజేపీ
  • అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ వస్తారంటూ ప్రచారం
  • అమిత్ షా షెడ్యూల్ సహకరించక పోవడంతో జేపీ నడ్డా రాక
  • అధికారికంగా ప్రకటించిన బీజేపీ తెలంగాణ శాఖ

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలకు చెందిన తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది.

ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, లేదంటే జేపీ నడ్డా గానీ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు ఇదివరకే వెల్లడించారు. మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని నేపథ్యంలో జేపీ నడ్డా ఈ సభకు రానున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.

Related posts

కేటీఆర్ పై మండిపడ్డ షర్మిల!

Drukpadam

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం …రాజ్యసభలో మంత్రి సమాధానం…

Drukpadam

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

Drukpadam

Leave a Comment