Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రంగంలోకి నారా బ్రాహ్మణి …వైసీపీ పై పరువు నష్టం దావా …!

వైసీపీ ఫేక్ పోస్టులపై పరువు నష్టం దావాకు నారా బ్రాహ్మణి సిద్ధమవుతున్నారు: టీడీపీ

  • జయలలిత ఫామ్ హౌజ్ ను నారా బ్రహ్మణి కొన్నారని పోస్టు
  • నిరుపేద అయిన బ్రాహ్మణి రూ.1,600 కోట్లతో ఎలా కొన్నారని అనుమానం
  • ఈ పోస్టులు ఫేక్ పోస్టులన్న టీడీపీ సోషల్ మీడియా విభాగం
  • వైసీపీలోని పేటీఎం బ్యాచ్ లో కొందరి పనేనని ఆరోపణ
  • వారిపై పరువు నష్టం దావాకు బ్రాహ్మణి సిద్ధమవుతున్నారని వెల్లడి

టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, వైసీపీలోని కొందరు ఫేక్ పోస్టులతో ఈ ప్రచారం చేస్తున్నారని, వారిపై పరువు నష్టం దావా వేసేందుకు రంగం సిద్ధమవుతోందని ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ దావాలను స్వయంగా నారా బ్రహ్మణినే దాఖలు చేయనున్నారని కూడా ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. నారా బ్రహ్మణి నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1,600 కోట్లతో జయలలితకు చెందిన ఫామ్ హౌజ్ ను కొన్నారని, అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ పోస్టును టీడీపీ ప్రస్తావించింది.

తనపైనా, తన భార్యపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాల్ని పంపి కేసులు పెట్టించే సీఎం జగన్…ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారని కూడా టీడీపీ ఆరోపించింది. తనకో ధర్మం, ఎదుటి వాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోవడానికి రంగం సిద్ధమవుతోందని హెచ్చరించింది. వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారని టీడీపీ ఆరోపించింది. ఇలాంటి వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారని ఆ పార్టీ వెల్లడించింది.

Related posts

మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి …ఖమ్మం లో అన్ని కమ్మలకేనా!

Drukpadam

సౌత్‌లో బీజేపీ ఆటలు సాగవని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి హెచ్చరిక…

Drukpadam

కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ!

Drukpadam

Leave a Comment