Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

  • తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
  • గురువారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకున్న వైనం
  • మక్తల్ లో రాహుల్ కు మత్స్యకారుల వినూత్న స్వాగతం

భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ…గురువారం నాటికి 50వ రోజు యాత్రను తెలంగాణలో కొనసాగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి గురువారం ఉదయం మొదలైన ఈ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా… 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ 26 కిలోమీటర్ల మేర నడిచారు.

ఇదిలా ఉంటే… తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలో అడుగుపెట్టింది. తమిళనాడు నుంచి మొదలైన యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటేసి తెలంగాణలోకి అడుగుపెట్టింది. మరోవైపు తెలంగాణలో రాహుల్ యాత్రకు ఊహించిన దాని కంటే అధిక స్పందన లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రకు మక్తల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. నీటిలో దిగిన మత్స్యకారులు.. వీ ఆర్ ఆల్వేస్ విత్ యూ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని రాహుల్ కు స్వాగతం పలికారు.

Related posts

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

Drukpadam

“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష‌ల్లో రాసిన విద్యార్థిని!

Drukpadam

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి సిద్ధూనే కారణం: అమరీందర్ భార్య ఆరోపణ!

Drukpadam

Leave a Comment