బజాజ్ సంస్థల అధినేత వంకాయలపాటి రాజా గత ఎన్నికల్లో ని ఖమ్మం లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఆయనకు టిక్కెట్ ఖరారైన నేపథ్యంలో అనూహ్యంగా మాజీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు పేరు తెరపైకి వచ్చింది . రావటమే కాకుండా ఆయన పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాజా అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగం నుంచి తప్పుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎర్పడింది. ఈ నేపథ్యంలో రాజా కొంత అసంతృప్తికి గురైనప్పటికి తప్పుకున్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో రాజాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాటినుండి ఆయన ప్రయాణం అజయ్ తోనే కొనసాగిస్తున్నారు .దీంతో మరోసారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
2024 వ సంవత్సరం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలో ఎవరు ఉంటారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుత లోక్ సభ సభ్యుడు లోకసభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు తిరిగి పోటీ చేస్తారా? ఆయనకు టిక్కెట్ లబిస్తుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి . దానికి కారణాలు లేకపోలేదు .ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి . అందుకు ఆయన చెప్పిన కారణం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేల అనుమతితోనే నియోజకవర్గాల్లో పర్యటించాలని నిబంధనలు తమ పార్టీలో ఉన్నాయని అందువలన తాను తిరగలేక పోతున్నాని చెబుతుంటారు. ఆయన మాటలకు ప్రజలు కన్విన్స్ కాలేక పోతున్నారు. పైగా ఇటీవల సీఎం ఢిల్లీ టూర్ సందర్బంగా కూడ నామాను పిలవలేదని తెలుస్తుంది. మునుగోడు ఎన్నికల్లో సైతం నామ కనిపించకపోవడంతో వంకాయలపాటి రాజా రంగంలోకి వస్తున్నారనే ప్రచారం ఆనోటా ఈనోటా వినిపిస్తూంది . చూద్దాం ఖమ్మంలో ఏమి జరుగుతుందో…..