Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాదయాత్రలో రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..

హైద్రాబాద్ లో రాహుల్ పాదయాత్ర హల్చల్

  • హైదరాబాద్ లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
  • రాహుల్ ని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక
  • పూర్తి న్యాయం చేస్తానని రాధికకు రాహుల్ హామీ
Rohit Vemula mother meets Rahul Gandhi

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు.

మరోవైపు, ఈరోజు తనను కలిసిన రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ ను ఆమె కోరారు. మరోవైపు మీకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. ఇంకోవైపు, రాహుల్ తో రోహిత్ తల్లి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించిన తమ్మినేని, పోతినేని…!

Drukpadam

నిప్పుల గుండం కాదు.. అగ్ని పర్వతంపై రోప్​ వాకింగ్​. 

Drukpadam

పంత్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం!

Drukpadam

Leave a Comment