Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మునుగోడు టీఆర్ యస్ దే అంటున్న సర్వేసంస్థలు…

మునుగోడులో టీఆర్ యస్ కె పట్టం కట్టిన సర్వేలు ..

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ యస్ గెలవబోతున్నట్లు అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి.రెండు పార్టీలు హోరాహోరిగా ఎన్నికల్లో పోరాడాయి. డబ్బులు పంచినట్లు ప్రచారం జరిగింది. కొన్ని గ్రామాల్లో తమకు ఇస్తామన్న డబ్బులు , బంగారం ఇవ్వలేదని అందువల్ల తాము ఓట్లు వేయబోమని పేర్కొన్నారు . తర్వాత ఏమిజరిగిందో తెలియదు కానీ అందరు వచ్చి ఓట్లు వేసేందుకు క్యూలో నిలబడి ఓట్లు వేశారు . అయితే ప్రచారం జరిగినంత డబ్బులు ఇవ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

సర్వేలు చెప్పిన లెక్కల ప్రకారం టీఆర్ యస్ కు ఓటర్లు పట్టం కట్టబోతున్నారు . టీఆర్ యస్ కు 45 నుంచి 51 శాతం వరకు ఇచ్చాయి. అదే విధంగా బీజేపీకి 35 నుంచి 39 శాతం గా ఉంది. కాంగ్రెస్ కు 14 నుంచి 16 శాతం ఓట్లు పొందనున్నట్లు పొందనున్నట్లు తెలుస్తుంది.

మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై  ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం..  
టీఆర్‌ఎస్‌- 48-51 శాతం 
బీజేపీ- 31-35 శాతం
కాంగ్రెస్‌- 13-15 శాతం
బీఎస్పీ- 5-7 శాతం
ఇతరులు- 2-5 శాతం.

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్‌- 41-42 శాతం 
బీజేపీ- 35-36 శాతం
కాంగ్రెస్‌- 16.5-17.5 శాతం
బీఎస్పీ- 4-5 శాతం
ఇతరులు- 1.5-2 శాతం. 

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..
టీఆర్‌ఎస్‌- 42.11 శాతం
బీజేపీ- 35.17 శాతం
కాంగ్రెస్‌- 14.07 శాతం
బీఎస్పీ- 2.95 శాతం
ఇతరులు- 5.70 శాతం.

Related posts

తమిళనాడులో ఉత్తుత్తి బ్యాంక్.. దాడులు చేసి మూసేసిన పోలీసులు!

Drukpadam

విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఇమ్రాన్ ఖాన్!

Drukpadam

సరిహద్దులు మూసి ఉన్నా న్యూజిలాండ్‌లో ప్రవేశించిన లారీ పేజ్.. ఎలా వచ్చారో చెప్పిన ఆ దేశ మంత్రి!

Drukpadam

Leave a Comment