Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం ఇక మహానగరం ..ఏపీ సర్కార్ నిర్ణయం …!

సిక్కోలు నగర పరిధి భారీగా పెంపు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం!

  • కొత్తగా 7 మండలాలను సుడా పరిధిలోకి చేరుస్తూ నోటిఫికేషన్
  • సుడా పరిధిలోకి రానున్న 307 గ్రామాలు
  • విస్తరణతో 5,294 చదరపు కిలో మీటర్లకు పెరగనున్న సుడా పరిధి

శ్రీకాకుళం పరిధిని భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది . ఉత్తరాంధ్ర అభివృద్దిపపై దృష్ఠి సారించిన జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తుంది . అందువులో భాగంగానే శ్రీకాకుళం పట్టణాన్ని నగరంగా అభివృద్ధి చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది . వికేద్రీకరణ దిశగా పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. మొత్తం 7 మండలాలను శ్రీకాకుళంలో కలుపుతూ మహానగరంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు .

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నగరం పరిధి ఒక్కసారిగా భారీగా పెరిగిపోనుంది. ప్రస్తుతం ఓ మాదిరి నగరంగా ఉన్న శ్రీకాకుళంను తాజాగా ఏపీ ప్రభుత్వం భారీ నగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం నగర పరిధిని ఒకేసారి భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం నగర పరిధిలోకి కొత్తగా 7 మండలాలను చేర్చనున్నారు. ఈ మండలాల ద్వారా ఏకంగా 307 రెవెన్యూ గ్రామాలు శ్రీకాకుళం నగర పరిధిలోకి చేరిపోనున్నాయి.

శ్రీకాకుళంలోని సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట మండలాలతో పాటు మన్యం జిల్లాలోని భామిని మండలాన్ని శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోకి చేరుస్తూ ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సుడా పరిధిలోకి కొత్తగా 1,121 చదరపు కిలో మీటర్ల ప్రాంతం చేరనుంది. దీంతో సుడా పరిధి 5,284 చదరపు కిలో మీటర్లకు పెరగనుంది.

Related posts

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు!

Drukpadam

కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

పాతబస్ స్టాండ్ ఉండాల్సిందే టీపీసీసీ చీఫ్-ఉత్తమ్ కుమార్ రెడ్డి…

Drukpadam

Leave a Comment