Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్రిడేషన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి….టీయూడబ్ల్యూజే (ఐజేయూ)

వరంగల్ కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ధర్నా
జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

అవినీతి అధికారులపై వార్తలు రాసిన జర్నలిస్టు అక్రిడిటేషన్ రద్దు చేస్తామని జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆద్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట సోమవారం జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. టీయూడబ్ల్యూజేే (ఐజేయు) వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆద్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ బి. గోపికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఐజేయు నాయకులు మాట్లాడుతూ అవినీతి వ్యతిరేక వార్తలు రాస్తే అక్రిడిటేషన్ లు రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వరంగల్ డీఈవో వాసంతి అక్రమాలకు పాల్పడ్డారని సెప్టెంబర్ 15న “సస్పెన్షన్ల పర్వం కాసుల వర్షం” అనే శీర్షికన కథనం ప్రచురితం అయిందని, డీఈవో వాసంతి వివరణ కూడా జోడించి…విలేకరి రాజన్న వార్త రాశారని, అయితే ఈ కథనంపై డీఈవో వాసంతి…తనపైన ఉద్దేశపూర్వకంగానే కథనం రాశారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారన్నారు. డీఈవో పై వచ్చిన అక్రమాలపై విచారణ జరపాల్సిన కలెక్టర్ ఆపని చేయకుండా…ఆంధ్రజ్యోతి విలేకరి అక్రిడిటేషన్ కార్డు రద్దు చేయాలని షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అయితే కలెక్టర్ గోపీ స్పందిస్తూ నోటీసులను ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మదు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటి విద్యాసాగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రామ్ చందర్, గడ్డం రాజిరెడ్డి, దుర్గా ప్రసాద్, తోట సుధాకర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు సంగోజు రవి, కె. రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు కె. లక్ష్మారెడ్డి,కంకణాల సంతోష్,సాయిరాం, పొడిశెట్టి విష్ణు వర్దన్, ఎస్. అంజన్ రావు, ఎస్. తిరుపతి రెడ్డి,నంబూద్రిపాద్, అలువాల సదాశివుడు, జన్ను స్వామి,బోళ్ల అమర్, నరేందర్, దండు మోహన్,టి. రవి, వెంకటేశ్వర్లు,ఎండి. షంషుద్దీన్, వంగ రమేష్,కామిశెట్టి రాజు,ప్రధీప్,సతీష్,భీమప్ప తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ సమ్మిట్ లో పెట్టుబడుల వరద …జగన్ విజనరీ కి అద్దం పట్టిందన్న మంత్రులు !

Drukpadam

This 50 Years Old Woman Reveals Secrets of Beauty Through Eating

Drukpadam

న్యూయార్క్ లో మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు!

Drukpadam

Leave a Comment