Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి పడకుండా చూడటమే జనసేన బీజేపీ లక్ష్యం !

వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూడడమే బీజేపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం: విష్ణువర్ధన్ రెడ్డి!

  • విశాఖ రానున్న ప్రధాని మోదీ
  • స్వాగతం పలికేందుకు విశాఖ చేరుకున్న బీజేపీ నేతలు
  • బీజేపీ, జనసేన పంథా ఒక్కటేనన్న విష్ణువర్ధన్ రెడ్డి 

2024 లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో బీజేపీ లో పావులు కదుపుతుంది . టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని చెబుతున్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను టీడీపీకి వెళ్లకుండా చూడటమే తమ లక్ష్యం అని స్పష్టం చేస్తుంది.తన భాగస్వామిగా ఉన్న జనసేనను కూడా అందుకు ఒప్పించేందుకు బీజేపీ సిద్ధపడుతుంది.దీనికోసం రెండు రోజుల పర్యటనకు విశాఖకు వస్తున్నా ప్రధాని మోడీని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ కు వస్తున్నారు . ప్రధాని కలిసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షలు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు .

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానుండడం రాష్ట్ర బీజేపీ నేతలను ఉత్సాహానికి గురిచేస్తోంది. ఈ సాయంత్రం మోదీ విశాఖ చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ నాయకత్వం ఇప్పటికే విశాఖ చేరుకుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారని, ఈ భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని విష్ణు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని, తమ అభిప్రాయం కూడా అదేనని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూడడమే బీజేపీ-జనసేన ఉమ్మడి లక్ష్యం అని ఉద్ఘాటించారు. బీజేపీ పంథా, జనసేన పంథా ఒక్కటేనని స్పష్టం చేశారు. టీడీపీని భుజాలపై మోయాల్సిన అవసరం బీజేపీకి గానీ, జనసేనకు గానీ లేదని అన్నారు.

Related posts

అత్యాచారాల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కొనసాగుతున్నట్టుంది: రేవంత్ రెడ్డి వ్యంగ్యం!

Drukpadam

ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి?: సీఎం జగన్ మండిపాటు

Ram Narayana

బీజేపీ మతోన్మాద చర్యలకు చెంప పెట్టు కర్ణాటక ఫలితాలు…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

Drukpadam

Leave a Comment