Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు!

ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు!
-మహాప్రస్థానంలో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
-కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులకు మాత్రమే అనుమతి
-నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన కృష్ణ

అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. దారికి ఇరువైపులా నిలబడిన అభిమానులు తమ అభిమాన నటుడికి కన్నీటితో వీడ్కోలు పలికారు.

మరోవైపు మహాప్రస్థానంలోకి కృష్ణ కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులను మాత్రమే అనుమతించారు. అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం వరకు మాత్రమే లైవ్ లో చూపించారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ ను ఆపేశారు.

హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కృష్ణ పాడె మోసిన మురళీమోహన్, బుద్దా వెంకన్న

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికకు చేరుకుంది. పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ బ్యాండ్ మధ్య అంతమ యాత్ర కొనసాగింది. పోలీసులు మహాప్రస్థానంలోకి అందరినీ అనుమతించలేదు. సన్నిహితులను మాత్రమే లోపలకు పంపి, ఇతరులందరినీ బయటే ఆపేశారు. మహాప్రస్థానం కు చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్, టీడీపీ నేత బుద్దా వెంకన్న మోశారు.

Related posts

చీర కట్టుకుంటే …రెస్టారెంట్ లోకి నో ఎంట్రీ …ఇది ఎక్కడో కాదు దేశరాజధాని ఢిల్లీలో!

Drukpadam

విజయవాడ స‌ర్కారీ స్కూల్లో సింగిల్ సీటు కోసం పోటీ ప‌రీక్ష‌!…

Drukpadam

వీరే టీఆర్ యస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు…

Drukpadam

Leave a Comment