Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పదికి పదీ గెలిపిస్తాం..సత్తుపల్లి కృతజ్ఞతా సభలో మంత్రి అజయ్

పదీకి పది గెలిపిస్తాం..సత్తుపల్లి కృతజ్ఞతా సభలో మంత్రి అజయ్
ఐక్యతతో ముందుకు నడుస్తాం ..
కేసీఆర్ జిల్లాకు అడిగిందల్లా ఇచ్చారుమనం ఆయనకు పది సీట్లు ఇవ్వాలి
సీఎం ఆశయాలకు అనుగుణంగా కష్టపడతాం..
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమే కార్యక్రమాలు ప్రజలకు వివరిద్దాం ..
జిల్లా అభివృద్ధిలో తమవంతు పాత్ర నిర్వహిస్తాంబండి , వద్దిరాజు
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ఎంపీ నామ

ఉమ్మడి జిల్లాలో ఒకనాడు ఒక్కటే స్థానం గెలిచిన టిఆర్ఎస్ ను ఈసారి పది స్థానాల్లో గెలిపిస్తామని,అందుకు అంతా ఐక్యతతో కష్టపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.సీఎం కేసీఆర్ జిల్లాకు అడిగిందల్లా ఇచ్చారు …మనం ఆయనకు పది సీట్లు ఇవ్వాలి అందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపు నిచ్చారు … రాజ్యసభ సభ్యులుగా నియమితులైన పారిశ్రామికవేత్త డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతా సభ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి వంటి విచ్ఛిన్నకర శక్తులు కొన్ని అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు,బిజెపిలో చేరని వాళ్లపై కక్షపూరిత కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈడీ, బీడీ అంటూ భయందాళ్లోనకు గురి చేయడంపై ఆయన మండిపడ్డారు .ఖమ్మం అంటే పోరాటాల జిల్లా అనే విషయం బిజెపి నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. మతతత్వ పార్టీ బిజెపి బలపడటానికి కాంగ్రెస్ చర్యలే కారణమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను తనదైన శైలిలో విమర్శించారు. ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ రాష్ట్రంలో యాత్ర జరపకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటూ యాత్ర నిర్వహించటం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రమంతా మేమే గెలుస్తామని ప్రకటనలు చేస్తున్న బిజెపికి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో ఎక్కడా డిపాజిట్లు రావని అన్నారు . ఖమ్మం జిల్లా పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అడిగిన నిధులిస్తూ అదనంగా రెండు రాజ్యసభ స్థానాలు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర తో కలిసి పది స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని హామీ ఇచ్చారు.

పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు. బిజెపి వాళ్లు అవకులు, చవాకులు మాట్లాడుతున్నారని, ఐక్యంగా వాళ్ళ కుట్రను ఎదుర్కొంటామని తెలిపారు. భద్రాచలం- సత్తుపల్లి వరకు వచ్చిన రైల్వే లైన్ 2012 లో కొవ్వూరు వరకు మంజూరు చేయడం జరిగిందని, దాన్ని అడ్డుకుని కేవలం సత్తుపల్లి వరకే పరిమితం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రూ 50వేల కోట్ల విలువ చేసే సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నామని తెలిపారు. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు నిధుల విషయంలో సాగుతున్న ప్రచారం నమ్మ వద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయటం కరెక్ట్ కాదన్నారు.పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు సండ్ర వెంకటయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించే దిశగా కృషి జరుపుతామని హామీ ఇచ్చారు.

బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సీఎం కల్పించిన ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించే దిశగా కృషి చేస్తామన్నారు.

 

అనంతరం బండి, ఒద్దిరాజుకు ఘనంగా సన్మానం జరిపారు. కార్యక్రమంలో చీప్ విప్ రేగా కాంతారావు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఖమ్మం మున్సిపల్ చైర్మన్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ కుమార్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగల్ రాజేందర్, కొండ బాల కోటేశ్వరావు, రాయల శేషగిరిరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!

Drukpadam

అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్!

Drukpadam

చంద్రబాబు పవన్ భేటీ …జగన్ సర్కారుపై సమరశంఖం..

Drukpadam

Leave a Comment