Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కృష్ణా జిల్లాలోకలకలం … జగన్ కటౌట్ కు నిప్పు…

కృష్ణా జిల్లాలో జగన్ కటౌట్ కు నిప్పుపెట్టిన దుండగులు.. ఘటనా స్థలికి వెళ్లిన డీఎస్పీ

  • కృష్ణా జిల్లా గూడూరులో కటౌట్ కు నిప్పు
  • నిన్న అర్ధరాత్రి నిప్పు పెట్టిన దుండగులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు

కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం కాలింది. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్ ను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. కటౌట్ ను దగ్ధం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

మరోవైపు బందరు డీఎస్సీ బాషా, పెడన రూరల్ సీఐ ప్రసన్న గౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి జగన్ వచ్చిన సందర్భంగా ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు మాట్లాడుతూ… ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ, కటౌట్లకు నిప్పు అంటించడమనేది సరైనది కాదని చెప్పారు. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

Related posts

సైబరాబాద్ కమిషనర్‌పై చర్యలకు కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

Drukpadam

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా.. కేటుగాళ్లు వున్నారు.. జర భద్రం!

Drukpadam

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తా..ఆర్మీ జవాన్

Ram Narayana

Leave a Comment