రండి కొట్టుకుందాం అని చంద్రబాబు అనడం సరికాదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి!
- కర్నూలులో వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్
- మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్
- స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- చంద్రబాబు ఒక పిచ్చివాడు అని వ్యాఖ్యలు
- చొక్కా చించుకుని రోడ్డుపై పడేలా ఉన్నాడని విమర్శలు
చంద్రబాబు కర్నూల్ జిల్లాలో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై , ప్రత్యేకించి సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలనీ అక్కడ ప్రజలు నిలదీశారు . కర్నూల్ కు న్యాయరాజధాని వస్తుంటే దాన్ని అడ్డుకుంటూ తిరిగి ఇక్కడ పర్యటించడం పై స్థానికులు ఎదురు తిరిగిరారు వారిపై ఆగ్రహం ప్రకటించారు .నేను రౌడీలకు , రౌడీని , గుండాలకు గుండాలను ఖబర్దార్ అంటూ ప్లే కార్డు లు ప్రదర్శించినవారిని హెచ్చరించారు .దీంతో బాబుపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యాఖ్యల్లో పదును పెంచుతూ, వైసీపీ శ్రేణులకు తీవ్ర హెచ్చరికలు చేయడం తెలిసిందే. నిన్న కర్నూలులో టీడీపీ ఆఫీసు వద్ద వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ, తన కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. రండి చూసుకుందాం… మీ సంగతేంటో తేలుస్తా… రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను అంటూ వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. చంద్రబాబు ఒక పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తీరు చూస్తుంటే వీధి రౌడీని తలపిస్తోందని అన్నారు.
రాజకీయల్లో ఒక్కోసారి పూలు పడుతుంటాయి, ఒక్కోసారి రాళ్లు పడుతుంటాయి… వాటిని స్వీకరించాలే తప్ప రండి కొట్టుకుందాం అని వ్యాఖ్యలు చేయడం సరికాదని నారాయణస్వామి హితవు పలికారు.
చంద్రబాబు చొక్కా చించుకుని రోడ్లపై కాగితాలు ఏరుకునే స్థితికి చేరుకునేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తీరు కూడా ఇలాగే ఉందని నారాయణస్వామి అన్నారు. పవన్ లో రాజకీయనాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవని విమర్శించారు.
కర్నూలులో చంద్రబాబు విన్యాసాలు అందరూ చూశారు: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో ప్రసంగించిన తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు తీవ్ర నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. న్యాయ రాజధానిపై వైఖరి అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణపై తమకు స్పష్టత ఉందని, వికేంద్రీకరణ ఎందుకు అవసరమో తాము స్పష్టంగా చెబుతున్నామని, కానీ వికేంద్రీకరణ ఎందుకు వద్దంటున్నారో, అమరావతే ఎందుకు రాజధానిగా కావాలంటున్నారో చంద్రబాబు చెప్పలేకపోతున్నారని సజ్జల విమర్శించారు.
“కర్నూలు వెళ్లినప్పుడు న్యాయరాజధానిపై ప్రజలు అడగరా? ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారా? టీడీపీ అంటేనే తిట్లు, దూషణలు, బూతులు! కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను అందరూ చూశారు. సీఎం మీద, వైసీపీ నేతల మీద, ఆఖరికి ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారు. చంద్రబాబుకు అంత కోపం ఎందుకు? మొన్నామధ్య పవన్ కల్యాణ్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా పవన్ కల్యాణ్ లాగా చెప్పు చూపించాలని కోరిక కలిగినట్టుంది” అంటూ సజ్జల వివరించారు.