Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వినతులు!

వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వినతులు!

  • దీనివల్ల వినియోగం పెరుగుతుందని సూచన
  • వ్యక్తుల చేతుల్లో డబ్బులు మిగిలి వినియోగంలోకి వస్తాయని అభిప్రాయం
  • కొన్ని రకాల ఉత్పత్తులపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలని డిమాండ్  

కేంద్ర ఆర్థిక మంత్రి రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2023-24) బడ్జెట్ రూపకల్పన పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి వివిధ రంగాలు, పరిశ్రమల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇలాంటి కీలక తరుణంలో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలంటూ సీఐఐ డిమాండ్ చేసింది. వ్యవస్థలో డిమాండ్ పుంజుకోవడానికి వీలుగా ఈ సూచన చేసింది.

పన్ను రేట్లను తగ్గిస్తే అది 5.83 కోట్ల మందికి ఉపశమనాన్ని ఇవ్వనుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంత మంది ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం జరిగింది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల వ్యక్తుల చేతుల్లో కొంత డబ్బు మిగులుతుందని, అది డిమాండ్ (కొనుగోళ్లు) రూపంలో తిరిగి వ్యవస్థలోకి చేరుతుందని సీఐఐ పేర్కొంది.

సీఐఐ మరో ముఖ్యమైన ప్రతిపాదన కూడా చేసింది. డిమాండ్ ను పెంచేందుకు కొన్ని రకాల వినియోగ వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి తగ్గించాలని కోరింది. పన్నుల ఎగవేతకు సంబంధించి చట్టపరమైన నిబంధనల్లో మార్పులను సూచించింది. ఎంత పన్ను ఎగవేశారనే దాని ఆధారంగా విచారణ ఉండకూదని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఐఐ కోరినట్టు ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ప్రభుత్వానికి సాధ్యపడకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ

Ram Narayana

భర్త మీద కోపంతో ఐదుగురు బిడ్డలను చంపిన కిరాతక తల్లికి జీవితఖైదు!

Drukpadam

బీసీలకు పెద్దపీఠ… ఇది జగన్ రికార్డు…సజ్జల

Drukpadam

Leave a Comment