Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి వైసీపీదే …సాగర్ టీఆర్ యస్ దే ….

తిరుపతి వైసీపీదే …సాగర్ టీఆర్ యస్ దే….
-ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా సంస్థ… వైసీపీకి ఎంత శాతం అంటే..!
-వైసీపీ కి 65 శాతం ,టీడీపీ కి 23 శాతం
సాగర్లో టీఆర్ యస్ కు 50 శాతం , కాంగ్రెస్ కు 40 శాతం బీజేపీ కి 6 శాతం
-తిరుపతిలో రెండవస్థానం లో తెలుగుదేశం
ఏప్రిల్ 17న తిరుపతి,సాగర్ ఉప ఎన్నికల పోలింగ్
మే 2న ఓట్ల లెక్కింపు
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా సంస్థ

 

దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అటు దేశంలోని పలు ప్రాంతాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా నిర్వహించారు. నేడు పశ్చిమ బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగియడంతో దేశవ్యాప్త ఎన్నికల కోలాహలం పరిసమాప్తమైంది. ఈ నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానంతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ల ఎగ్జిట్ పోల్స్ ను ఆరా సంస్థ వెల్లడించింది. తిరుపతిలో వైసీపీ భారీ ఆధిక్యతలో గెలవబోతుందని తెలిపింది . అదేవిధంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ యస్ మంచి మెజార్టీ సాదించబోతున్నట్లు తెలిపింది.

ఈ ఎన్నికలో అత్యధికంగా వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా అంచనా వేసింది. అదే సమయంలో టీడీపీకి 23.10 శాతం, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ యస్ అభ్యర్థి నోముల భరత్ కు పోలైన ఓట్లలో 50 శాతం , కాంగ్రెస్ అభ్యర్థి కుందూరి జానారెడ్డికి 40 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ వెల్లడించింది . బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి.

Related posts

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే!: కేంద్రం

Drukpadam

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం …రాజ్యసభలో మంత్రి సమాధానం…

Drukpadam

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కొండా సురేఖకు దక్కని చోటు!

Drukpadam

Leave a Comment