ఆంధ్రప్రదేశ్

యూట్యూబ్‌లో చూసి హైదరాబాద్‌లో చోరీలు.. కటకటాల్లోకి పామర్రు యువకుడు!


యూట్యూబ్‌లో చూసి చోరీలు చేయడం నేర్చుకున్న ఓ వ్యక్తి నెల రోజుల్లో రెండు చోరీలు చేసి ఆపై కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన కొట్టి సాయిరాం (28)పై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో బైక్‌లు, ట్రాక్టర్‌ టైర్ల దొంగతనం కేసులతోపాటు రోడ్డు ప్రమాద కేసులు ఉన్నాయి. దీంతో అక్కడి పోలీసుల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రశాంత్‌నగర్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.

సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నా తన బుద్ధి పోనిచ్చుకోని సాయిరాం.. యూట్యూబ్‌లో చూసి చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న వివేకానందనగర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతి మెడలోని 8 తులాల గొలుసును లాక్కుని పరారయ్యాడు. అంతకుముందు రోజే తన బైక్ చోరీకి గురైనట్టు మోహన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసిన బైక్‌తోనే గొలుసు దొంగతనం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. మరోవైపు, చోరీ చేసిన గొలుసును తాకట్టుపెట్టిన నిందితుడు సాయిరాం రూ. 40 వేలు తీసుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు గొలుసు, బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

ప్రపంచంలో ఎంతో పాప్యులారిటీ ఉన్న యూట్యూబ్ చానల్స్

Ram Narayana

Three BRS candidates elected unopposed to Telangana Council

Drukpadam

ఏపీలో కొత్త రేష‌న్ కార్డులు.. ఎప్ప‌ట్నుంచంటే..!

Ram Narayana