Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లండన్ కు వెళ్లేందుకు జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి!

  • లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెలు
  • కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు హాజరవుతున్న జగన్
  • ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు లండన్ కు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు 20 రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. 

మరోవైపు, నిన్న హైకోర్టులో జగన్ కు ఊరట లభించింది. జగన్ పాస్ పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్ కు పాస్ పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది. ఎన్వోసీ కోసం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

Related posts

ప్రేమపెళ్లిళ్లు …విడాకులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు …

Drukpadam

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలి :పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్

Drukpadam

వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనని డౌటు: ఎంపీ మోపిదేవి

Drukpadam

Leave a Comment