ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

  • తగ్గుముఖం పట్టిన కరోనా సంక్షోభం
  • వ్యాక్సినేషన నిబంధనలు సడలించిన కేంద్రం
  • హామీ పత్రం ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టీకరణ
  • తాజా నిర్ణయం ఈ అర్ధరాత్రి నుంచి అమలు

ఇప్పటిదాకా విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది.

ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరంలేదు. ఈ ఆంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

కొవిడ్-19 సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగానూ, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించి, కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసు విడుదలైంది.

ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది. అయితే, కరోనా కేసులు ఎక్కువైతే ఈ నిబంధన మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Related posts

అమరావతిలో ఐటీకి కొత్త జోష్.. 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్…

Ram Narayana

సీఎల్పీ నేత భట్టి …మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి మధ్య వార్

Drukpadam

బాపట్లలో హృదయ విదారకం.. డబ్బుల్లేక కన్నతండ్రి శవాన్ని బైక్‌పై తరలించిన కొడుకు!

Ram Narayana