Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘోరం… గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘోరం… గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి!
-ఎర్రబోడు అటవీప్రాంతంలో వలస గిరిజనుల పోడు వ్యవసాయం
-పోడు భూముల్లో మొక్కలు నాటిని అటవీశాఖ…అడ్డగించిన గిరిజనులు
-అధికారులతో గుత్తికోయల వాగ్వాదం
-ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు విచక్షణారహితంగా నరికి చంపారు. జిల్లాలోని చండ్రగొండ మండలం బెండలపాడు వద్ద ఎర్రబోడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు అధికారులు నాటిని మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అనేక సార్లు ఫారెస్ట్ అధికారులకు ,గొత్తికోయలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక సందర్భంలో పోలిసుల లాఠీచార్జి కి దారి తీసింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు.

ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి పట్ల ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సంతాపం..

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడిలో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాసరావు మృతి పట్ల ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తికోయలు(వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆయ‌న కుంటుబ సభ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది.

పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌ని చేస్తుంటే… విధి నిర్వ‌హణ‌లో ఉన్న అధికారుల‌పై దాడులు చేయ‌డం స‌రికాద‌ని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అభిప్రాయపడ్డారు. అట‌వీ ఆక్ర‌మ‌ణ‌ల‌ను స‌హించేది లేద‌ని, ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అట‌వీ అధికారులు మ‌నోస్థైర్యం కొల్పోవ‌ద్ద‌ని వారు ధైర్యం చెప్పారు.

Related posts

అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడీ ముప్పు తప్పేది! ఇండోర్ మెట్లబావి ప్రమాదంపై స్థానికులు!

Drukpadam

సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ల కలకలం!

Drukpadam

చదివింది బీటెక్..చేశేది చోరీలు…

Drukpadam

Leave a Comment