జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన అధికార పార్టీ జడ్పీటీసీలు!
-అర్ధాంతరంగా వాయిదా పడిన మహబూబాబాద్ జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశం..
-నిధులు, విధులు నినాదంతో నిరసనగళం..!!
-మంత్రి చెప్పిన జెడ్పీటీసీలు మనుసుమార్చుకోలేదు..!
-యంపి, ఎమ్మెల్యే, గ్రంధాలయసంస్థచైర్మన్ దౌత్యం కూడా ఫలించలేదు..!!
-మూకమ్మడిగా జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశాన్ని బహిష్కరించిన జెడ్పీటీసీలు..!
మహబూబాబాద్ జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశంలో అనుహ్యపరిణామాలు చోటుచేసుకున్నాయి.. _అధికార, విపక్ష జెడ్పీటీసీలనే తేడాలేకుండా మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించి వెల్లిపోవడంతో కోరంలేక సభ వాయిదాపడింది. .
తమకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని.., సమావేశానికి రాకుండా జెడ్పీటీసీలు అందరూ చైర్ పర్సన్ చాంబర్ లోనే కూర్చున్నారు.. జెడ్పీచైర్ పర్సన్ బిందు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మెత్తబడలేదు.. ఇంతలోనే సమావేశానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ వచ్చి సభలో జెడ్పీటీసీలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు చూసి విషయం ఆరాతీసారు.
జెడ్పీటీసీలను పిలిచిరమ్మని చైర్ పర్సన్ బిందును, సిఈఓ ను మంత్రి సత్యవతిరాథోడ్ పంపించారు. అయినా పలితంలేకపోవడంతో స్వయంగా మంత్రి సత్యవతిరాథోడ్ రంగంలోకి దిగారు. యంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జిల్లా గ్రంధాలయసంస్థచైర్మన్ గుడిపూడి నవీన్ రావులను వెంటబెట్టుకుని జెడ్పీటీసీలతో మాట్లాడేందుకు చాంబర్ కు వచ్చారు. అనేక రకాలుగా వారికి నచ్చచెప్పారు.
అధికారపార్టీ జెడ్పీటీసీలు సభకు హాజరుకాకుంటే తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పిన జెడ్పీటీసీలు ఏ..మాత్రం తగ్గలేదు.. ఒకదశలో.. తన సిడిఎప్ నుండి నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన జెడ్పీటీసీలు దిగిరాలేదు..
మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలందరు జిల్లాపరిషత్ సమావేశంలో ఉండగానే..!! జెడ్పీటీసీలు మాత్రం చెప్పపెట్టకుండా కార్యాలయం నుండి వెళ్ళిపోవడంతో అధికారులు కూడా ఖంగుతిన్నారు. పోన్ లు చేసి వెనక్కి పిలిపించే ప్రయత్నాలు కూడా పలించలేదు.. ఏ..ఒక్క జెడ్పీటీసీ సభకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో జిల్లా పరిషత్ సమావేశాన్ని వాయిదా వేసారు. ఈ..తతంగం అంతా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.