Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు కన్నీటి వీడ్కోలు..

ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు కన్నీటి వీడ్కోలు..
తండోపతండాలుగా పాల్గొన్న ప్రజలు , ప్రజాప్రతినిధులు
కుటుంబసభ్యులకు ఓదార్పు
ఈర్లపుడిలో మంత్రులు పువ్వాడ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లతో కలిసి నివాళులు అర్పించిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అంతిమ యాత్రలో పాడె మోసిన మంత్రులు ఎంపీ రవిచంద్ర

నిన్న గొత్తికోయల దాడిలో మరణించిన ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు కన్నీటి వీడ్కోలు పలికారు . వేలాది మంది శ్రీనివాస్ రావు అంతిమయాత్రలో పాల్గొన్నారు . ఫారెస్ట్ ఉద్యోగులు తమ అధికారి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జోహార్ శ్రీనివాస్ రావు అంటూ నినదించారు .

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. శ్రీనివాస రావు భౌతిక‌కాయానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి , రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ,పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అధికారులు , ప్రజాప్రతినిధులు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొన్నారు .

శ్రీనివాస రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి, మనో ధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని వారంతా భరోసా నిచ్చారు.
గ్రామంలో శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొని, మంత్రులతో కలిసి వద్దిరాజు రవిచంద్ర పాడే మోశారు.

సీఎం స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతాం …ఉద్యోగులు

శ్రీనివాస్ రావు అంత్యక్రియలకు హాజరైన ఫారెస్ట్ ఉద్యోగులు తమకు ఆయుధాలు ఇస్తేనే విధులకు హాజరవుతామని అన్నారు . అంతకు ముందు శ్రీనివాస్ రావు కు కన్నీటి వీడ్కోలు పలికారు . ఇదే విషయాన్నీ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరైన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , పువ్వాడ అజయ్ లకు స్పష్టం చేశారు. మంత్రులు కూడా మీడియా మాట్లాడుతూ ఫారెస్ట్ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు . ఇది చాల దురదృష్టకర ఘటన సీఎం కేసీఆర్ కూడా దీనిపై చేలా సీరియస్ గా ఉన్నారు . ఉద్యోగుల ఆందోళన కూడా న్యాయసమ్మతమైనది అని మంత్రి అజయ్ కుమార్ అన్నారు .

వద్దిరాజు దాతృత్వం ….2 లక్షల సహాయం

 

గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబాన్ని మంత్రులపాటు హైద్రాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో వచ్చిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబసభ్యులను ఓదార్చి తనవంతు సహాయంగా 2 లక్షల రూపాయలు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు . తన సహాయాన్ని మంత్రులు పువ్వాడ అజయ్ , ఇంద్రకరణ్ రెడ్డి ల చేతులమీదుగా ఇప్పించారు .

Related posts

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… ఒక మావోయిస్టు మృతి

Drukpadam

ఉమ్మడి జిల్లాలో దూకుడు పెంచిన పువ్వాడ …గెలుపు భాద్యత ఆయనదే …!

Drukpadam

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం…

Drukpadam

Leave a Comment