Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రేంజర్ హత్య ఎలా జరిగిందంటే ….

రేంజర్ హత్య ఎలా జరిగిందంటే ….
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్య కేసు నిందితుల అరెస్ట్ …
వారితో పటు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్లాంటేషన్ లో పశువులను మేపవద్దు అన్నందుకు రేంజర్ పై దాడి
దాడిని చిత్రీకరించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండలపాడు పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు గుత్తికోయల గుంపు వద్ద జరిగిన దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు మృతి చెందిన విషయం విదితమే …అయితే ఆయన హత్య ఎలా జరిగింది… ఎంతమంది దాడి చేశారనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. దాన్ని పోలీసులు నివృత్తి చేశారు . కేవలం ఇద్దరు మాత్రమే ఫారెస్ట్ రేంజర్ పై దాడికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. వారు అక్కడ ప్లాంటేషన్ లో పశవులను మేపుతుండగా ఇక్కడ వద్దని వారించారు. ఆదృశ్యాలను రేంజర్ వెంట వచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తేజావత్ రామారావు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు . దాన్ని గొత్తి కోయలు తప్పు బట్టారు . దీంతో దాడికి పాల్పడ్డారు . దాడిలో మడకం తులా , పోడియం నంగా పాల్గొన్నారు . వారు ఇద్దరు కలిసి ఫారెస్ట్ రేంజర్ పై తమ దగ్గర ఉన్న వేట కొడవళ్ళతో విచక్షణ రహితంగా నరకడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ రావు ను మొదట చంద్రుకొండ పి హెచ్ సి కి తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లోని కిమ్స్ కు తరలించారు . అయనప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేక పోయారు .

దాడికి పాల్పడ్డ తులా , నంగా లు ఆ రాత్రి ఫారెస్ట్ లోనే పడుకొని మరసటి రోజు ఛత్తీస్ ఘడ్ లోని వారి గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బుధవారం ఎర్రబోడు సమీపంలోని సీతారామ కాలువ వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు .

గుత్తి కోయల కదిలికలపై జాగ్రత్తగా ఉంటున్న ఫారెస్ట్ అధికారులు …ఎందుకో ఆరోజు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయాలు ఉన్నాయి. ప్లాంటేషన్ లో పశువులను మేపుతున్నట్లు సమాచారం తో అక్కడకు వెళ్లిన రేంజర్ కేవలం ఒక సెక్షన్ ఆఫీసర్ ను వెంట బెట్టుకొని పోవడం వల్లనే ఇది జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

పోడు భూముల్లో ప్లాంటేషన్ చేయడం ఇష్టం లేని గొత్తి కోయలు, అధికారులపై తరుచు గొడవపడుతుంటారని ఫారెస్ట్ ఉద్యోగులు అంటున్నారు . అంతకు కొద్దీ రోజుల ముందు కూడా ప్లాంటేషన్ ను వారు అడ్డుకున్నారని అంటున్నారు . ఇది పోలిసుల లాఠీచార్జి వరకు వెళ్ళింది. చివరకు రేంజర్ హత్యకు దారితీయడంపై ఫారెస్ట్ వణికి పోతుంది. తమకు ఆయుధాలు ఇవ్వకుండా ఉద్యోగాలు చేయబోమని ఫారెస్ట్ సిబ్బంది అంత్యక్రియలకు హాజరైన మంత్రులకు స్పష్టం చేశారు.

Related posts

‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే వ్యాసం రాసిన రచయిత్రి తన భర్తనే చంపేసింది!

Drukpadam

ఖమ్మం లో లేడీ కిలాడి … లాడ్జ్ లో మకాం చివరికి కటకటాలు

Drukpadam

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి… గుంటూరు జిల్లా జైలుకు తరలింపు…

Drukpadam

Leave a Comment