Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రష్యాకు షాక్.. ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్!

రష్యాకు షాక్.. ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్!

  • ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధం
  • రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న తీర్మానానికి 494 మంది మద్దతు
  • రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించేందుకు అమెరికా నిరాకరణ

ఉక్రెయిన్‌తో నెలల తరబడి భీకర యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో నిర్వహించిన ఓటింగ్‌కు 494 మంది మద్దతు పలకగా 58 మంది వ్యతిరేకించారు. 44 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా, పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందని, కాబట్టి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.

క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా దేశాలను ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితాలో చేర్చిన అమెరికా.. రష్యాను మాత్రం ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించింది. అయితే, యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.

Related posts

ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు… చేపల కోసం ఎగబడుతున్న జనాలు!

Drukpadam

రష్యా ఉక్రియేన్ యుద్ధం … బంగారం ధరలు పైపైకి!

Drukpadam

రౌడీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. జగన్ పై విమర్శలు!

Ram Narayana

Leave a Comment