Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫారెస్ట్ స్టేషన్లు ,ఆయుధాలు ఇవ్వాల్సిందే :ఫారెస్ట్ ఉద్యోగుల డిమాండ్!

ఫారెస్ట్ స్టేషన్లు ,ఆయుధాలు ఇవ్వాల్సిందే :ఫారెస్ట్ ఉద్యోగుల డిమాండ్!
-ఫారెస్ట్ రేంజర్ హత్య నేపథ్యంలో ఖమ్మంలో భారీ నిరసన
-రక్షణ లేనిదే ఆదువుల్లోకి వెళ్ళేది లేదు
-ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వ్యే చేస్తే దాడులు చేస్తున్నారు
-వాళ్లకు భూములు రాకుండా అడ్డుపడుతున్నామనే ఆగ్రహంగా ఉన్నారు
-గొత్తి కోయలను పంపించాల్సిందే …లేక పొతే నిధులు నిర్వహణ కష్టం

ఫారెస్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేసి ..సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు డిమాండ్ చేశారు . చండ్రుగొండ మండలం బెండలపాడు శివారు ఎర్రబోరులో గొత్తికోయల దాడిలో శ్రీనివాస్ రావు మరణించడంతో ఫారెస్ట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తమకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించనందునే శ్రీనివాస్ హత్యకు గురైయ్యారని వారు ఆరోపిస్తున్నారు . గురువారం ఖమ్మంలో ఫారెస్ట్ సిబ్బంది భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు . త్రి టౌన్ పరిధిలోని ఫారెస్ట్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు .

తమకు తగిన హామీ ఇచ్చేవరకు విధులకు హాజరు కాబోమని వారు అన్నారు పోడుభూముల రక్షణ కోసం నీతినిజాయతితో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ప్రజల ఆగ్రహానికి గురిఅవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . నిన్న చనిపోయిన ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాస్ రావు అంత్యక్రియల సందర్భంగా కూడా సిబ్బంది అక్కడకు వచ్చిన మంత్రులను నిలదీశారు . దీనిపై మంత్రులు వారికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు . సర్వ్యే చేసేందుకు వెళుతున్న సిబ్బందిపై పోడుసాగుదార్లు కక్ష్య పెంచుకుంటున్నారని సిబ్బంది అంటున్నారు . ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొనేంతవరకు తాము ఆదువుల్లోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు .

Related posts

రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!

Drukpadam

అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది…మంత్రి సింగిరెడ్డి

Drukpadam

జూన్ లో వీటికి ముగిసిపోతున్న గడువు.. త్వరపడండి..!

Drukpadam

Leave a Comment