Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాందేవ్ బాబాను చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి: సీపీఐ నారాయణ!

రాందేవ్ బాబాను చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి: సీపీఐ నారాయణ!

  • మహిళలు ఏమీ ధరించకపోయినా బాగుంటారన్న రాందేవ్ బాబా
  • మహిళా వ్యతిరేక చట్టం కింద శిక్షించాలన్న సీపీఐ నారాయణ
  • ఒక సన్యాసి కార్పొరేట్ వ్యాపారిగా మారిపోయారని విమర్శ

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు చీరలు, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని బాబా అన్నారు. అక్కడితో ఆగక.. తన కళ్లకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదాన్ని రాజేశారు.

ఈ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. యోగాను మార్కెటింగ్ చేసే రాందేవ్ బాబా మహిళల గురించి దారుణంగా మాట్లాడారని విమర్శించారు. మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారనే వ్యాఖ్యలు దారుణమని అన్నారు. మహిళా వ్యతిరేక చట్టం కింద ఆయనను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమంలో అక్కడున్న మహిళలు ఆయనను చెప్పుతో కొట్టాలని అన్నారు. పతంజలి సంస్థ పేరుతో ఆయన ఒక కార్పొరేట్ గా మారిపోయారని… ఒక సన్యాసి కార్పొరేట్ వ్యాపారిగా ఎలా మారుతాడని ప్రశ్నించారు.

Related posts

కలకోట గ్రామంలో కరివేద పద్ధతిలో వడ్లను పొలంలో చల్లి సాగు…

Drukpadam

ఆ పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే!

Drukpadam

వామ్మోఇంజనీరింగ్ ఫీజులు …. ఆందోళ‌న‌లో విద్యార్థుల త‌ల్లిదండ్రులు!

Drukpadam

Leave a Comment