Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ మరో తప్పటడుగు వేయనున్నారా… ?

పవన్ మరో తప్పటడుగు వేయనున్నారా… ?
తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ
మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్
తూర్పు కాపు నేతలకు దిశానిర్దేశం
బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల అంశంపై చర్చ

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో రైజింగ్ స్టార్ …ఆయన ఆవేశం ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందా అంటే అవునంటున్నారు పరిశీలకులు .ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు విషయంలో ఇల్లు కోల్పోయినవారిని ఇదివరికే పరామర్శించిన పవన్ వారు కోర్టు కు తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని. దీంతో పవన్ తప్పటడుగులు వేశారనే విమర్శలు వెల్లు ఎత్తయి. అయినప్పటికీ మరోసారి ఇప్పటం పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేయనున్నారనే అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే అడ్డగించాలన్సినదే కాని అదే పనిగా గుడ్డి వ్యతిరేకత కనపరిచి పలచబడటం మంచిది కాదనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటం గ్రామ రైతులకు ఆర్థికసాయం అందించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నేడు మంగళగిరి చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆయన తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీలోని కులాల పరిస్థితులు, ఉత్తరాంధ్ర జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా పవన్ ప్రసంగించారు.

తూర్పు కాపుల విషయానికొస్తే…. ఒక మంత్రి, ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకింత ఇబ్బంది పడుతున్నాం? అని అన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వ ప్రమాణాలను బట్టి రిజర్వేషన్ స్టేటస్ తీసేశారంటే ఓ అర్థం ఉంది… కానీ ఇక్కడ ఏపీలో మూడు జిల్లాల్లోనే స్టేటస్ ఇచ్చి, మిగతా 10 జిల్లాల్లో తూర్పు కాపులను గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర నుంచి తూర్పు కాపులు అన్ని జిల్లాలకు వలస వెళ్లారని, వారు ఎక్కడికి వెళ్లినా కులం మారదని, కానీ రాజకీయ ప్రాబల్యం ఉంటే తప్ప కుల సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదని వివరించారు.

“తూర్పు కాపులకు మూడు జిల్లాల్లోనే ఓబీసీ సర్టిఫికెట్ ఎందుకు అమలు చేస్తున్నారు, మిగతా జిల్లాల్లో ఎందుకు ఇవ్వడంలేదు? ఇది మిగతా కులాలకు వర్తింపజేయకుండా కేవలం తూర్పు కాపులకే ఎందుకు వర్తింపజేస్తున్నారు?… ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారు దీనిపై వివరణ ఇవ్వాలి” అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Related posts

గ్రామం యూనిట్ గా ప్రజాసమస్యలపై ఉదృతం పోరాటాలు …తమ్మినేని

Drukpadam

టీఆర్ యస్ లో పొంగులేటి ,మాజీమంత్రి తుమ్మలకు డోర్స్ క్లోజెనా ?

Drukpadam

బొగ్గు గనుల వేలం నిలిపి వేయాలి ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ!

Drukpadam

Leave a Comment