Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కోర్ట్ మొట్టికాయలు వేసినా మారని పవన్ కళ్యాణ్ …

కోర్ట్ మొట్టికాయలు వేసినా మారని పవన్ కళ్యాణ్ …
ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చడం బాధించిందన్న పవన్
గ్రామస్థులకు అండగా ఉంటానన్న జనసేనాని
ఇళ్ల కూల్చివేత బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేత
ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్ కల్యాణ్
అమరావతి రైతులు కూడా ఇదే తెగువ చూపితే రాజధాని తరలిపోయేది కాదని వ్యాఖ్య

ఇప్పటం విషయంలో ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరి మారడంలేదు . ఇప్పటం వెళ్లి అక్కడ నివసిస్తున్నవారికి కోర్ట్ కు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని అడుగుతారని ఆశించారు .కానీ అది జరగలేదు .పైగా ఇప్పటం ప్రజల తెగువ నచ్చింది అని వారిని ప్రోత్సహించడం నచ్చిందని అనడం ఏమిటనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

తమ ఇళ్లను కూల్చేముందు ప్రభుత్వాని నోటీసులు ఇవ్వాలని ఆలా ఇవ్వకుండా కూల్చారని కోర్ట్ ను ఆశ్రయించారు .అదినిజమేనని నమ్మిన కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. వాస్తవాల్లోకి వెళ్లి పరిశీలిస్తే అలాంటిది ఏమిలేదు …ప్రభుత్వం వారిని రోడ్ వెడల్పు కోసం నోటీసులు ఇచ్చిందనేది తేలడంతో హైకోర్టు షాక్ అయింది. కోర్ట్ కు తప్పుడు సమాచార ఇచ్చినందుకుగాను వారికీ ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆదివారం తిరిగి ఇప్పటం సందర్శించి వారికీ లక్ష రూపాయలు చొప్పున అందించారు .

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలో పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన చెప్పారు. ఇప్పటం గ్రామస్థులు జనసేనకు అండగా ఉన్నారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారని పవన్ మండిపడ్దారు. ఆదివారం ఇప్పటం చేరుకున్న పవన్ కల్యాణ్ కూల్చివేతల బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. బాధితులు ఒక్కొక్కరికీ జనసేన తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థులకు తాను అండగా నిలుచుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ గడప కూల్చేదాకా విశ్రమించబోమని తేల్చిచెప్పారు. ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్.. అమరావతి రైతులు ఇదే తెగువ చూపితే రాజధాని తరలిపోయేదికాదని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల ఇళ్లు, భూములను తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమని, చిన్నతనం నుంచి ఈ విషయం తనను బాధిస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు.

Related posts

చంద్రబాబు కుట్రలో భాగమే రాష్ట్రపతికి లేఖ :ఎంపీ మిధున్ రెడ్డి…

Drukpadam

బీజేపీ కి సవాల్ గా మారనున్న రాష్ట్రపతి ఎన్నిక…

Drukpadam

నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసమే: ట్రంప్

Drukpadam

Leave a Comment