Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఆ డైలాగ్ వినగానే జగన్ గుర్తొచ్చారు: ‘శాసనసభ’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రోజా…

ఆ డైలాగ్ వినగానే జగన్ గుర్తొచ్చారు: ‘శాసనసభ’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రోజా…
-ఇంద్రసేన, రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రం ‘శాసనసభ’
-వేణు మందికంటి దర్శకత్వంలో చిత్రం
-సినిమా విజయం సాధించాలన్న రోజా
-చిత్రబృందానికి శుభాకాంక్షలు

ఇంద్రసేన, రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్ తదితరులు నటించిన చిత్రం ‘శాసనసభ’. వేణు మందికంటి దర్శకత్వంలో సాప్ బ్రో ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.

కాగా, ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఏపీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా సక్సెస్ సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రం పేరు ‘శాసనసభ’ అనగానే తనకు చాలా ఆసక్తిగా అనిపించిందని తెలిపారు. రాజకీయాలు అంటే నిత్యం యుద్ధరంగంలో ఉన్నట్టేనని, ఈ యుద్ధంలో ఎవరైతే ప్రజల మనసు గెలుస్తారో వాళ్లే శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని అన్నారు.

“ప్రతివాడికి యుద్ధంలో గెలవాలని ఉంటుంది… కానీ ఒక్కడే గెలుస్తాడు… వాడినే వీరుడు అంటారు” అనే డైలాగ్ నచ్చిందని, ఆ డైలాగ్ వినగానే సీఎం జగన్ గుర్తొచ్చారని రోజా వెల్లడించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరెడ్డి ఆకట్టుకునే డైలాగులు రాశారని అభినందించారు.

ఇక, కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి తొలగిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓట్లు వేయాలని, మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మంచే జరుగుతుందని రోజా పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, ఇక ప్రజల కోసం నాయకులు మారాలని అభిప్రాయపడ్డారు.

Related posts

సిమిమా రాజకీయాలు …”వ్యూహం “పై టీడీపీ అభ్యతరం …

Ram Narayana

నేడే మా ఎన్నికలు …సాయంత్రానికి ఫలితం…

Drukpadam

లంకంత ఇల్లుని లక్ష రూపాయలకే అమ్మేసిన సావిత్రి!

Ram Narayana

Leave a Comment