Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్నూలులో సజ్జలకు నిరసన సెగ… అడ్డుకున్న దళితసంఘాలు!

కర్నూలులో సజ్జలకు నిరసన సెగ… అడ్డుకున్న దళితసంఘాలు!

ఎస్సీ జాబితాలో మాదాసి కురబలు
  • జీవో 53 రద్దు చేయాలన్న దళిత సంఘాల నేతలు
  • బిర్లా గేటు వద్ద సజ్జల కారును అడ్డుకున్న జేఏసీ నేతలు

కర్నూలులో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. మాదాసి కురబలను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల జేఏసీ నేతలు బిర్లా గేటు వద్ద సజ్జల కారును అడ్డుకున్నారు. జీవో 53ని రద్దు చేయాలని దళిత సంఘల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

కాగా, సజ్జల నేడు వైసీపీ నేతలు, వివిధ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. డిసెంబరు 5న కర్నూలు ఎస్టీబీసీ కాలేజిలో రాయలసీమ గర్జన కార్యక్రమంపై వారితో చర్చించారు. వికేంద్రీకరణను అడ్డుకునేవారికి ఈ సభ ద్వారా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పూర్తి మద్దతు ఇస్తున్నారని సజ్జల మీడియాకు వెల్లడించారు.

సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి ఏపీ ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. చట్టం కూడా సీఎం జగన్ కు సహకరిస్తుందని అన్నారు. మూడు రాజధానుల అంశంలో హైకోర్టులో భిన్నమైన తీర్పులు రాగా, ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయితే రాష్ట్రానికి నష్టం కలుగుతుందన్న అంశాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించిదని సజ్జల వివరించారు.

Related posts

సంచలనంగా మారిన షర్మిల నిర్ణయం …చైత్ర ఇంటిముందే దీక్ష!

Drukpadam

ఏపీ లో పరిషత్ ఎన్నికలు బాయికాట్… టీడీపీ సంచలన నిర్ణయం!

Drukpadam

మూడురోజులపాటు దేశ రాజకీయ కేంద్రంగా హైద్రాబాద్ మహానగరం…

Drukpadam

Leave a Comment